e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home ఆదిలాబాద్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి..
ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలి
సమస్యలు లేకుండా అన్ని శాఖల అధికారులు చూడాలి
అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల

నిర్మల్‌ అర్బన్‌, సెప్టెంబర్‌ 15 : జిల్లా కేంద్రం లో నిమజ్జన ఏర్పాట్లను రాష్ట్ర అటవీ, పర్యావ రణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి బుధవారం పరిశీలించారు. చైన్‌గే ట్‌ నుంచి బంగల్‌పేట్‌ వినాయక్‌ సాగర్‌ వరకు నిమజ్జన ఏర్పాట్లను అధికారులు, ఉత్సవ సమితి సభ్యులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ ఆదివారం వినాయక నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూ చించారు. శోభాయాత్ర జరిగే మార్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు మరమ్మతులు చేప ట్టాలని మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌కు సూ చించా రు. విద్యుత్‌ సమస్యలు లేకుండా చూడా లని విద్యుత్‌ శాఖ అధికారులకు సూచించారు. ఉత్స వాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీ భద్రత ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు. వినాయక్‌ సాగర్‌ వద్ద వినాయకులను నిమజ్జనం చేసేందుకు క్రేన్లను, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. బంగల్‌పేట్‌ వినాయకు డి వద్ద మంత్రి పూజలు నిర్వహించారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సాజిద్‌, ఏఈ వినయ్‌ కుమార్‌, ఎఫ్‌ ఎస్‌ సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాం చందర్‌, ముడుసు సత్యనారాయణ, కౌన్సిలర్లు నేరేళ్ల వేణు, గండ్రత్‌ రమణ, నాయకులు అడ్ప పోశెట్టి, అప్పాల వంశీ తదిత రులు పాల్గొన్నారు.
ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి
భైంసా, సెప్టెంబర్‌ 15 : గణేశ్‌ నిమజ్జన ఏర్పా ట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ఆదేశించారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఇన్‌చార్జి ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌తో కలిసి పరిశీలించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పెద్ద విగ్రహాల నిమజ్జ నానికి క్రేన్‌లను వినియోగించుకోవాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదే శించారు. విద్యుత్‌ సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసి న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఏఎస్పీ కిరణ్‌ ఖారే, మున్సిపల్‌ కమిషనర్‌ ఎంఏ అలీం, వైస్‌ చైర్మన్‌ జాబీర్‌ అహ్మద్‌, గాలి రవి ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana