ఆపత్కాలంలో ఆదుకునే అత్యవసర వాహనాల నిర్వహణపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. కాలం చెల్లిన 108, 102 అంబులెన్స్‌ల స్థానంలో కొత్తవి అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 50 వాహనాలు కేటాయిం చింది. అత్యాధునిక సాంకేతిక విధానమున్న ఈ వెహికిల్స్ నేడు జిల్లాకు చేరుకునే అవకాశమున్నది.
– మంచిర్యాల ఏసీసీ, ఆగస్టు 1
మంచిర్యాల ఏసీసీ, ఆగస్టు 1 : ఉమ్మడి జిల్లా ప్రజలకు వైద్యారోగ్య సేవలు మరింత చేరుక కాను న్నాయి. వైద్యారోగ్య శాఖ రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 204 ‘108’ అంబులెన్స్‌లు, 228 ‘102’ అమ్మ ఒడి వాహనాలు, 34 హర్ సే (పార్థీవ) వా హనాలను కొనుగోలు చేసింది. వీటిని మంగళవా రం హై దరాబాద్ నెక్లెస్ రోడ్డులో సీఎం కేసీఆర్ చే తుల మీదుగా ప్రారంభించారు. ఇందులో భా గం గా ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 52 ‘108’ అంబులెన్స్‌లు అందుబాటులో ఉండగా, ఇందులో కాలం చెల్లిన వాహనాల స్థానంలో 22 వాహనాలు కొత్తవి రిప్లేస్ చేశారు. ఇక గర్భిణుల కో సం ప్రవేశపెట్టిన అమ్మఒడి వాహనాలు (102 వా హనాలు) ప్రస్తుతం 47 ఉపయోగంలో ఉన్నా యి. ఇందులో కొన్నింటికీ కాలం చెల్లిపోవడంతో వాటిని తొలిగించి వాటి స్థానంలో 28 వాహనాలను ఏర్పా టు చేశారు. అంబులెన్సులు నేడు ఆయా జి ల్లాలకు చేరనుండగా వెంటనే వినియోగించనున్నా రు. దీం తో పాటుగా సర్కారు దవాఖానల్లో మరణించిన వారి పార్థీవ దేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ప్రస్తుతం ఒక ‘హర్ సే’ (పార్థీవ) వాహనాలు వస్తున్నాయి. వీటితో పాటుగా త్వరలో ఎమర్జెన్సీ రోగులకు మెరుగైన చికిత్స కోసం నగరాల్లోని సర్కా ర్ దవాఖానలకు తరలించేందుకు అత్యాధునిక సదుపాయాలు గల మరొక 108 ప్రత్యేక వాహనాన్ని జిల్లాలకు కేటాయించనుంది.
మంచిర్యాలకు 108 వాహనాలు 2 ( బెల్లంపల్లి, వేమనపల్లి), అమ్మఒడి 7 (మంచిర్యాల 2, చెన్నూ ర్, జైపూర్, మందమర్రి, బెల్లంపల్లి, లక్షెటిపేట), అదిలాబాద్‌కు 108 వాహనాలు 15 (ఉట్నూరు 2, ఇంద్రవెల్లి, నార్నూర్, గుడిహత్నూర్, సిరికొండ, నేరేడిగొండ, బేల, ఇచ్చోడ, బోథ్, తలమడుగు, భీంపూర్, ఆంకోలి, మావల, బజార్హత్నూర్ మం డలాలకు ఒకటి చొప్పున) కేటాయించనున్నారు. అలాగే అమ్మ ఒడి 7 ( ఆదిలాబాద్‌కు రెండు, ఇంద్రవెల్లి, నార్నూర్, ఇచ్చోడ, బజార్హత్నూర్, తలమడుగు) , కుమ్రం భీం ఆసిఫాబాద్‌కు 108 వాహనాలు 3 (సిర్పూర్ (యూ), వాంకిడి, దహె గాం మండలాలు), అమ్మ ఒడి 10 (పెంచికల్‌పేట, బెజ్జూర్, కాగజ్‌నగర్, సిర్పూర్ టీ, కెరిమెరి, తిర్యాణి, రెబ్బెన, ఆసిఫాబాద్, వాంకిడి, జైనూర్), నిర్మల్‌కు 108 వాహనాలు 2 (బైంసా, నిర్మల్), అమ్మఒడి 4 (బైంసాకు 2, నిర్మల్, కడెం) వాహనాలు వస్తున్నాయి. వీటితో పాటు మంచిర్యాల జి ల్లాకు 1, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు 1, ఆదిలాబాద్ జిల్లాకు 2 హర్ సే వాహనాలు సర్కారు దవాఖానలకు చేరనున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 108 అంబులెన్స్‌లు ఆదిలాబాద్ 18, మంచిర్యాల 14, కుమ్రం భీం ఆసిఫాబాద్ 12, నిర్మల్ 8 మొత్తంగా 52 వాహనాలు ఉన్నాయి. ఇందులో కాలం చెల్లిన వాహనా లు ఉంటే ఆక్కడ కొత్త వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి తోడు అమ్మఒడి 102 వాహనాలు ఆదిలాబాద్ 16, మంచిర్యాల 10, నిర్మల్ 5, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 16 ఉన్నా యి. మొత్తంగా 47 వాహనాల ద్వారా గర్భిణులు, బాలింతలకు సేవలు అందుతున్నాయి.
గతంలో ప్రమాదాలు జరిగిన సమయంలో 108 కు ఫోన్ చేస్తే ఆ ఫోన్ కాల్ హైదరాబాద్‌లోని సెం ట్రల్ ఆఫీస్‌కు.. అకడి నుంచి దగ్గర్లో ఉన్న 108 అంబులెన్స్ డ్రైవర్‌కు సమాచారం వెళ్లేది. డ్రైవర్, సిబ్బంది పూర్తి సమాచారం తీసుకొని ఘటనాస్థలానికి చేరుకొని వైద్య సేవలను అందించేందుకు కాస్త సమయం పట్టేది. ఆ జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర వాహనాలన్నింటికీ ప్ర త్యేక జీపీఎస్ పరికరాన్ని అమర్చింది. ఈ కొత్త సాం కేతిక విధానం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు 108 కు కాల్ చేసిన వ్యక్తికి 108 సెంట్రల్ ఆఫీస్ నుంచి తన ఫోన్ నంబర్‌కు, ఆ ఏరియాలో అందుబాటు లో ఉన్న అంబులెన్సు డ్రైవర్‌కు ఒక ట్రాకింగ్ లింక్ వెళ్తుంది. క్షణాల్లోనే వాహనం అక్కడి నుంచి బయ లు దేరుతుంది. ఈ లింక్ ద్వారా 108 వాహనం ఎకడుంది, ఎంతసేపట్లో ఘటనాస్థలికి చేరుకుంటుంది అనే పూర్తి సమాచారం బాధితుడికి చేరుతుంది. తద్వారా అంబులెన్స్ ఎప్పటి లోగా వస్తుం దో అని స్పష్టం గా తెలుస్తుంది. ఈ పరికరాన్ని 102 అమ్మ ఒడి వాహనాలకు సైతం అమర్చారు.
అత్యవసర సమయాల్లో 108, 102 వాహనాలు ప్ర జలకు విలువైన సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు జిల్లాలకు 22 ‘108’, 28 ‘102’ వాహనాల రాకతో మరింత వేగంగా వైద్య సేవలు అందించే వీలుంటుంది. ప్రమాదంలో ఉన్న వారికి అత్యవసర సేవలు వెంటనే అందుతా యి. అలాగే వాటితో పాటు ఎమర్జెన్సీ కేసులను హైదరాబాద్ లాంటి నగరాలకు తరలించడానికి ఒక ప్రత్యేక వాహనం, దురదృష్టవశాత్తు చనిపోయిన వారి పార్థీవ దేహాలను తరలించేందుకు హర్సే వాహనాన్ని జిల్లాకు కేటాయించారు. ఈ నేపథ్యంలో పాత వాహనాల స్థానంలో కొత్తవి సమకూర్చారు.
-సామ్రాట్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 108, 102 వాహనాల ప్రోగ్రాం మేనేజర్