Balka Suman | చెన్నూరులో రాక్షస పాలన.. మంత్రి ఆదేశాలతోనే బీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో సోదాలు..!
Balka Suman : చెన్నూరు మున్సిపాలిటీలో రాక్షస పాలన నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) అన్నారు. మల్లేశం గౌడ్ ఇంట్లో సోదాలు చేస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.
Balka Suman : చెన్నూరు మున్సిపాలిటీలో రాక్షస పాలన నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి వివేక్ వెంకటస్తామి ఆదేశాలతోనే బీఆర్ఎస్ నాయకుడు మల్లేశం గౌడ్ ఇంట్లో ఎన్నికల అధికారులు, పోలీసుల తనిఖీలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మల్లేశం గౌడ్ ఇంట్లో సోదాలు చేస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంత్రి వివేక్ పంపిస్తేనే వచ్చి అధికారలు సోదా చేస్తున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో డబ్బులు, మందు సీసాలు ఉన్నాయని, కానీ అవి పోలీసులకు, అధికారులకు కనపడవని ఆయన ధ్వజమెత్తారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్, మంత్రి వివేక్ ప్రయత్నిస్తున్నారని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని బాల్క సుమన్ విమర్శించారు.
చెన్నూరులో రాక్షస పాలన నడుస్తుంది
చెన్నూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకుడు మల్లేశం గౌడ్ ఇంట్లో ఎన్నికల అధికారులు, పోలీసుల తనిఖీలు
సోదాలు చేస్తున్న అధికారుల తీరుపై మండిపడ్డ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
మంత్రి వివేక్ పంపిస్తేనే వచ్చి అధికారలు సోదా చేస్తున్నారు
మంత్రి… pic.twitter.com/l5dAqW40ZW
— Telugu Scribe (@TeluguScribe) February 9, 2026
అధికారులు, పోలీసులు మంత్రి వివేక్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, కేవలం బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ఇతర కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో సోదాలు ఎందుకు చేయడం లేదు? అని పోలీసులను, ఎన్నికల అధికారులను మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

