BCCI : భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)కు బిగ్ షాకిచ్చింది బీసీసీఐ. టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన రో-కో వేతనాల్లో భారీ కోత విధించింది. వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఇప్పటివరకూ రూ.7 కోట్లు అందుకుంటున్న ఈ స్టార్ ఆటగాళ్లును గ్రేడ్ ‘ఏ ప్లస్’ నుంచి తప్పించింది. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్న ఇద్దరినీ ‘బీ’ కేటగిరీకి మార్చింది. నిరుడు రెండు ఫార్మట్లకు సారథిగా ఎంపికైన శుభ్‌మన్ గిల్‌కు ఊహించనట్టుగానే సెంట్రల్ కాంట్రాక్టుల్లో ప్రమోషన్ దక్కింది.
ప్రతి ఏడాది ఆరంభంలో వార్షిక కాంట్రాక్టులను ప్రకటించే భారత బోర్డు ఈసారి కఠిన నిర్ణయం తీసుకుంది. కేవలం ఒకేఒక ఫార్మాట్లో ఆడుతున్నారనే కారణంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను గ్రేడ్ ఏ ప్లస్ నుంచి తొలగించింది. అయితే.. గత సీజన్‌తోనే ఏ ప్లస్ ర్యాంక్‌కు స్వస్తి పిలికి.. ‘ఏ’ గ్రేడ్‌లోకి ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను చేర్చారు. మహిళా క్రికెటర్లలో నలుగురు గ్రేడ్ ఏ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు ఈ ర్యాంక్‌లో ఉన్నారు.
🚨 News 🚨
BCCI announces Annual Player Retainership for Team India Senior Men and Senior Women for the 2025-26 season#TeamIndia | Details 🔽https://t.co/Rd3pUCPRr9 pic.twitter.com/UNYRThs1kW
— BCCI (@BCCI) February 9, 2026
పురుష క్రికెటర్లు గ్రేడ్ ఏ – శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా
గ్రేడ్ బీ – విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, సిరాజ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్
గ్రేడ్ సీ – అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివం దూబే, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, ధ్రువ్ జురెల్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్
మహిళా క్రికెటర్లు ఏ గ్రేడ్ – హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ
గ్రేడ్ బీ – రేణుకా సింగ్, షఫాలీ వర్మ, రీచా ఘోష్, స్నేహ్ రానా
గ్రేడ్ సీ – రాధా యాదవ్, అమన్‌జోత్ కౌర్, ప్రతీకా రావల్, క్రాంతి గౌడ్, ఉమా ఛెత్రీ, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి, యస్తికా భాటియా, హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, జి.కమలిని, వైష్ణవి శర్మ, తేజల్ హసబ్నిస్