Srisailam : శివరాత్రి సమీపిస్తున్న వేళప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam)లో అమానుష ఘటన చోటు చేసుకుంది. శివస్వాములపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న భక్తులను గంటల కొద్ది క్యూలో నిలిపి వేయడమే కాకుండా.. దర్శనం కోసం వచ్చిన శివస్వాములపై లాఠీతో దాడికి తెగబడ్డారు.
శ్రీశైలం ఆలయ సిబ్బంది నిర్వహణ లోపంతో సోమవారం గందరగోళం నెలకొంది. సిబ్బంది నిర్వహణ లోపంతో క్యూ లైన్లలో గంటల తరబడి నిల్చున్న శివస్వాములు ఒక్కసారిగా దర్శనం కోసం ఎగబడ్డారు. దాంతో, వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. భక్తులు, శివస్వాములను భయభ్రాంతులకు గురి చేస్తూ.. చితకబాదారు. పోలీసులు శివస్వాములపై దాడి చేయడాన్ని పలువురు ఖండించారు. సిబ్బందిని వదిలేసి తమపై దాడికి పాల్పడడం హేయమైన చర్య అని శివస్వాములు పోలీసులపై మండిపడ్డారు. ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీశైలంలో శివ స్వాముల పై పోలీసుల దాడి
ఆలయ సిబ్బంది నిర్వహణ లోపంతో శ్రీశైలంలో గందరగోళం
ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న భక్తులను గంటల కొద్ది క్యూలో నిలిపివేసిన సిబ్బంది
సిబ్బంది నిర్వహణ లోపంతో ఒక్కసారిగా దర్శనం కోసం ఎగబడ్డ భక్తులు
దీంతో భక్తులు, శివస్వాములపై లాఠీలతో… pic.twitter.com/u9IywRWsPO
— Telugu Scribe (@TeluguScribe) February 9, 2026