BCCI : భారత క్రికెటర్లను సానబెడుతున్న బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(CoE)లో కొత్త నియామకాలకు బీసీసీఐ పచ్చజెండా ఊపింది. పలు కీలక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. కోచింగ్ సిబ్బందితో పాటు పెర్ఫార్మెన్స్ స్టాఫ్ నియామకాలు కూడా చేపడుతున్నట్టు సోమవారం బీసీసీఐ వెల్లడించింది. ఆశావహులకు ఉండాల్సిన అర్హతలు, వయో పరిమితి వంటి వివరాలను కూడా వెబ్సైట్లో పొందుపరిచింది.
యువ క్రికెటర్లకు శిక్షణ కేంద్రంగానే కాదు.. రిహాబిలిటేషన్ కేంద్రంగానూ పేరొందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భారత క్రికెట్‌కు చాలా కీలకం. గాయపడిన ఆటగాళ్లు కోలుకున్న తర్వాత ఫిట్నెస్ సాధించేది ఇక్కడే. నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామాలు చేసి.. ఫిట్నెస్ నిరూపించుకున్నాకే పునరాగమనం చేస్తుంటారు. అందుకని.. సీఓఈను ఎప్పటికప్పడు పటిష్టం చేస్తుంటుంది బీసీసీఐ.
🚨 News 🚨
BCCI invites applications for Coaching and Performance Staff positions at the Centre of Excellence.
The following positions are open for applications:
1. Batting Coach (2 positions)
2. Fast Bowling Coach (3 positions)
3. Fielding Coach (4 positions –…
— BCCI (@BCCI) February 9, 2026
ఈ క్రమంలోనే కొత్త కోచ్‌ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ నింపిన అప్లికేషన్లను పంపాల్సిందిగా బీసీసీఐ కోరింది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. వడబోత అనంతరం.. అర్హులైన వాళ్లకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అనంతరం కోచ్‌లుగా ఎంపికైన వాళ్ల పేర్లను బీసీసీఐ ప్రకటిస్తుంది.
1. బ్యాటింగ్ కోచ్ – 2 పోస్టులు
2. ఫాస్ట్ బౌలింగ్ కోచ్ – 3 పోస్టులు
3. ఫీల్డింగ్ కోచ్ – నాలుగు పొజిషన్స్ (3 పురుషులు, ఒకరు మహిళ)
4. పెర్ఫార్మెన్స్ అనలిస్ట్ – ఒక పోస్ట్