Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
Irumudi | ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వంద రోజులు, రెండు వందల రోజులు, ఏడాది పాటు సినిమాలు ఆడటం పెద్ద విజయంగా భావించేవారు. థియేటర్లలో సినిమా సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతుంటే అభిమానులు పండుగలా వేడుకలు చేసుకునేవారు. కానీ ప్రస్తుతం ఓటీటీ ప్రభావం పెరగడంతో థియేటర్లలో సినిమాల రన్ టైమ్ బాగా తగ్గిపోయింది.
Irumudi | ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వంద రోజులు, రెండు వందల రోజులు, ఏడాది పాటు సినిమాలు ఆడటం పెద్ద విజయంగా భావించేవారు. థియేటర్లలో సినిమా సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతుంటే అభిమానులు పండుగలా వేడుకలు చేసుకునేవారు. కానీ ప్రస్తుతం ఓటీటీ ప్రభావం పెరగడంతో థియేటర్లలో సినిమాల రన్ టైమ్ బాగా తగ్గిపోయింది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా మొదటి వారం, పది రోజుల తర్వాత థియేటర్లలో కనిపించడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సినిమా ఏకంగా 100 రోజుల పాటు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవడం విశేషంగా నిలిచింది. ఆ అరుదైన ఘనతను మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా సొంతం చేసుకుంది.
రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రవితేజ మాస్ ఇమేజ్‌కు శివ నిర్వాణ తనదైన ఎమోషనల్ టచ్ జోడించడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. బాక్సాఫీస్ వద్ద కూడా అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో నవంబర్ 28 నాటికి ఆరు కేంద్రాల్లో విజయవంతంగా 100 రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంది.
‘ఇరుముడి’ సినిమా వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లోని బాలానగర్ మైత్రి విమల్ 70ఎంఎం థియేటర్లో ఘనంగా వేడుకలు నిర్వహించింది. రాత్రి 10:23 గంటల షో సందర్భంగా జరిగిన ఈ సెలబ్రేషన్స్‌కు దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత రవిశంకర్, సీనియర్ నటులు సాయికుమార్, అజయ్ ఘోష్‌తో పాటు పలువురు చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చిత్ర విజయాన్ని అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. సినిమాలోని చార్ట్‌బస్టర్ పాటలను బిగ్ స్క్రీన్‌పై రెండుసార్లు ప్రదర్శించడంతో థియేటర్ మొత్తం అభిమానుల కేరింతలు, సందడితో మారుమోగిపోయింది. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం సినిమాల ఫలితాలను మొదటి మూడు రోజుల కలెక్షన్లు, ఫస్ట్ వీకెండ్ వసూళ్లతోనే అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ఓటీటీలో త్వరగా విడుదలవుతాయనే కారణంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘ఇరుముడి’ సినిమా 100 రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శితమవడం విశేషంగా మారింది.
100 Days General Blockbuster
@ShivaNirvana
#Irumudi https://t.co/e4T1b69MV1— Chinnu_Rebelwood (@PRABOSSTHEKiNG) November 28, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
Road Accident | దైవ దర్శనానికి వెళ్తూ యాక్సిడెంట్.. 13 మంది మృతి
Ramayana | సీత పాత్రపై విమర్శలు.. నెగిటివిటీపై లేడీ పవర్‌స్టార్ అదిరిపోయే సమాధానం!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

