తానూర్, .జూలై 7 : గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఝరి(బి), ఝరితండా, హిప్నెల్లి తండా గ్రామాలకు చెందిన 96 మంది గిరిజనులకు 207 ఎకరాలకు సంబంధించి పోడు భూముల హక్కు పత్రాలను తానూర్‌లోని రైతు వేదికలో శుక్రవారం అందజేశారు. పోడుభూముల హక్కు పత్రాల పంపిణీ సందర్భంగా గిరిజన మహిళలు సంతోషంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలసి నృత్యం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వ గిరివికాసం పథకం కింద నిధులు మంజూరు చేస్తున్నదని చెప్పారు. గిరిజన తండాలు పంచాయతీలుగా మారాయన్నారు. ఈ సం దర్భంగా గిరిజనులు ఎమ్మెల్యేను సన్మానించారు. హిప్నెల్లితండాలోని 146 సర్వే నంబర్లో 75 ఎకరాలు, సర్వే నంబర్ 170లో 46 ఎకరాల అసైన్డ్ భూములను లబ్ధిదారులకు అందించాలని హిప్నెల్లి సర్పంచ్ తాన్సింగ్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కేజీబీవీలో విద్యార్థులకు నోట్‌బుక్స్ ఎమ్మెల్యే అందించారు. ఎస్వో అలేఖ్య సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ తాడేవార్ విఠల్ హంగి ర్గా సొసైటీ చైర్మన్ నారాయణ్రావుపటేల్, వైస్ ఎంపీపీ జెల్లావార్ చంద్రకాంత్, ఆత్మ చైర్మన్ కానుగంగి పోతారెడ్డి, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, మాజీ జట్పీటీసీ ఉత్తం బాలేరావు, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ యాద వ్, కోఆప్షన్ సభ్యుడు గోవింద్రావు పటేల్, ఉప సర్పంచ్ నయీం, సర్పంచ్‌లు బొల్లిపెల్లి బాలాజీ, తాన్సింగ్, అబ్దుల్‌గనీ, శ్యాం పటేల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజీప్రసాద్, ఎంపీడీవో శ్రీనివాస్‌రావు, ఏవో గణేశ్, అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ నంద్యానాయక్, ఎంపీవో మోహన్‌సింగ్, ఏఈవోలు సంఘవి, అంబాదాస్, బీఆర్ఎస్ నాయ కులు శ్రీనివాస్‌రెడ్డి, సాయినాథ్, అబ్దుల్ ఖరీం, భీం పవార్, కార్యదర్శులు రవికాంత్‌రెడ్డి, కదం శివాజీ, విక్రమ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
105 మందికి పోడు పట్టాల పంపిణీ
కుంటాల, జూలై 7 : మండలంలోని 105 మంది లబ్ధిదారులకు పోడు పట్టాలను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కొత్తపల్లి గంగామణి బుచ్చన్న, ఎంపీపీ అప్క గజ్జారాం, వైస్ ఎంపీపీ మౌనిక నవీన్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఖదీర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు దొనికెన వెంకటేశ్, తాటి మహేశ్వర్, సబ్బిడి గజేందర్, గౌస్, పురుషోత్తం, రమణా గౌడ్, ఇంద్రారెడ్డి, జాగృతి అధ్యక్షుడు బోగ లక్ష్మణ్ పాల్గొన్నారు.
హామీ నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్
కడెం, జూలై 7: పోడు సాగు చేసుకుంటున్న ఆదివాసీ, గిరిజనులను గుర్తించిన సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం పట్టాలు అందించారని, అలాగే రైతుబంధు, రైతుబీమా అందిస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ తెలిపారు. మండలంలోని కొండుకూర్ ఫంక్షన్ హాల్లో వివిధ గ్రామాలకు చెందిన 750 మంది పోడుదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఖానాపూర్ నియోజకవర్గం లో మొత్తం 6 వేల మందికి పట్టాలు పంపిణీ చేసినట్లు వివరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల శంకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు రఫీక్ హైమద్, ఆత్మ చైర్మన్ కానూరి సతీశ్, వైస్ ఎంపీపీ కట్టా శ్యాంసుందర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గోళ్ల వేణుగోపాల్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మల్లేశ్, సర్పంచ్‌లు రంభాదేవి, వెంకటేశ్, రాజిరెడ్డి, బీఆర్ఎస్ మం డల ఉపాధ్యక్షుడు కన్నె శ్రీనివాస్, ప్రజాప్రతి నిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
1065 మంది రైతులకు
పెంబి, జూలై 7: మండలంలోని 4800 ఎకరాల పోడు భూమికి సంబంధించి 1065 మంది రైతులకు ఎమ్మెల్యే రేఖానాయక్ పట్టాలు పంపిణీ చేశారు. పెంబి రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అంతకుముందు లోతోర్యతండాలో ఇటీవల గుగ్లావత్ కిషన్ మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. డీటీడీవో అంబా జీ, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, సీఐ రవీందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుప్పాల శంకర్, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సల్లా నరేందర్ రెడ్డి, ఎంపీపీ భూక్యా కవిత, జడ్పీటీసీ జానుబాయి, సర్పంచ్‌లు పూర్ణచందర్ గౌడ్, తానాజీ, సుదర్శన్, నరేశ్, మహేందర్, ఎంపీటీసీ రామారావు పాల్గొన్నారు.