e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home ఆరోగ్యం పండంటి బిడ్డకోసం.. పన్నెండు సూర్య నమస్కారాలు!

పండంటి బిడ్డకోసం.. పన్నెండు సూర్య నమస్కారాలు!

పండంటి బిడ్డకోసం.. పన్నెండు సూర్య నమస్కారాలు!

సూర్య నమస్కారాలతో శరీరం ఉత్తేజితమవుతుంది. కండరాలు శక్తిని పుంజుకుంటాయి. శరీరంలోని అన్ని భాగాల్లో రక్తప్రసరణ మెరుగవుతుంది.

  • నిటారుగా నిలబడాలి. చేతులు రెండూ వదులుగా వదిలి పెట్టాలి. నిటారుగా ముందుకు చూస్తూ శ్వాస నిదానంగా తీసుకోవాలి. ఇప్పుడు, రెండు చేతులను తలపైకి తీసుకెళ్లి జోడించి (నమస్కారం) ఊర్ధ హస్తాసన స్థితిలోకి రావాలి.
  • ఊర్ధ హస్తాసనం నుంచి ఉత్కటాసన స్థితిలోకి అంటే, గోడ కుర్చీ వేసినట్టు మోకాళ్లను రెండూ వంచి, చేతులను ముందుకు తీసుకు రావాలి. నమస్కారం పొజిషన్‌లో ఉన్న చేతుల్లో బొటన వేళ్లపై దృష్టి నిలపాలి.
  • నిదానంగా ఉత్కటాసనం నుంచి ఊర్ధ హస్తాసన స్థితిలోకి రావాలి. తర్వాత కాస్త ఎడం ఉండేలా రెండు కాళ్లనూ జరపాలి. ఇప్పుడు నిదానంగా గోడ కుర్చీ వేసినట్టుగా సిట్టింగ్‌ స్వాట్‌ పొజిషన్‌లోకి రావాలి.
  • ఈ పొజిషన్‌ నుంచి శరీర బరువునంతా ఎడమ భాగంపై పడేలా చేసి, కుడికాలిని వెనక్కి స్ట్రెచ్‌ చేసి తల పైకెత్తి చూడాలి. తిరిగి శరీర బరువును కుడిభాగంపై పడేలా చేసి, ఎడమ కాలిని వెనక్కి తీసుకొని స్ట్రెచ్‌ చేస్తూ పైకి చూడాలి. ఈ సమయంలో శ్వాస నిదానంగా తీసుకోవాలి.
  • తిరిగి సిట్టింగ్‌ స్వాట్‌ స్థితిలోకి రావాలి. ఇప్పుడు రెండు చేతులూ నేలమీద ఆనించాలి. నిదానంగా ఎడమచేతిని ఎడమ మోకాలిమీదికి తీసుకోవాలి. ఈ స్థితిలో 20 సెకండ్లు ఉండాలి. తిరిగి ఉత్కటాసన స్థితిలోకి రావాలి.
  • చివరగా ఊర్ధ హస్తాసన స్థితికి చేరుకొని నిదానంగా సమస్థితికి చేరుకోవాలి.
  • సూర్యనమస్కారాలు చేసేటప్పుడు ప్రతి ఆసనంలో 20 సెకండ్లు ఉండాలి. వ్జైనానుంచి రక్తస్రావం అవుతున్న వాళ్లు, తల, కళ్లు తిరగడం, వాంతులు అయ్యేలా ఉన్నవాళ్లు వీటిని ప్రయత్నించొద్దు.

యోగ ప్రక్రియలో సూర్యనమస్కారాలకు చాలా ప్రాధాన్యం ఉంది. గర్భిణులకు ప్రత్యేకంగా కొన్ని సూర్య నమస్కారాలు సూచించారు పెద్దలు. ఈ 12 రకాల నమస్కారాలు నిత్యం చేయడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారు.

- Advertisement -

పండంటి బిడ్డకోసం.. పన్నెండు సూర్య నమస్కారాలు!అనితా అత్యాల
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు
6309800109

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పండంటి బిడ్డకోసం.. పన్నెండు సూర్య నమస్కారాలు!
పండంటి బిడ్డకోసం.. పన్నెండు సూర్య నమస్కారాలు!
పండంటి బిడ్డకోసం.. పన్నెండు సూర్య నమస్కారాలు!

ట్రెండింగ్‌

Advertisement