Menopause | మహిళల జీవనచక్రంలో మెనోపాజ్ ముఖ్యమైన మలుపు. నెలసరి ఆగిపోయే ఈ సమయంలో ఆమె శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ దశ స్త్రీల మెదడులోనూ మార్పులకు కారణం అవుతుందని వెల్లడించింది జర్మన్ సెంటర్ ఫర్ న్యూరో డీజనరేటివ్ డిసీజ్ సంస్థ.
మెదడు లోపలి చిన్నచిన్న గాయాలను వైద్య పరిభాషలో బ్రెయిన్ బయోమార్కర్లుగా పిలుస్తారు. మెదడును స్కాన్ చేసినప్పుడే ఇవి కనిపిస్తాయి. వీటి పరిమాణం ఎక్కువగా ఉంటే బ్రెయిన్ స్ట్రోక్, అల్జీమర్స్లాంటివి వచ్చే ఆస్కారం అధికమని గత అధ్యయనాలు చెబుతున్నాయి. మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో బ్రెయిన్ మార్కర్లు ఎక్కువగానే కనిపిస్తాయి. అంతమాత్రాన అది పక్షవాతం, డిమెన్షియాలాంటి వాటికి సంకేతం కాదని చెబుతున్నారు జర్మనీ శాస్త్రవేత్తలు. సాధారణ వ్యక్తుల్లో ఈ మార్కర్లు ఎక్కువగా కనిపిస్తే మాత్రం.. ప్రమాద హెచ్చరికే.
Menopause | మెనోపాజ్ ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలి?
పీరియడ్స్‌లో సమస్యలా? ఈ యోగాసనాలు వేస్తే మంచిదట!!