Parenting tips | పిల్లలను మీరు ఎలా పెంచుతున్నారు?’ – ఆలోచించాల్సిన ప్రశ్నే ఇది. మీ పెంపకాన్ని బట్టే వాళ్ల అలవాట్లు, అభిరుచులు ఏర్పడతాయి. మంచి అలవాట్లు, మంచి అభిరుచులు జీవన మార్గాన్ని నిర్దేశిస్తాయి.
చెప్పేది వినండి: పిల్లలు మాట్లాడుతుంటే విసుక్కోకుండా వినండి. వారిని నిరుత్సాహ పరచొద్దు. ఎవరికి తెలుసు, మీ బిడ్డ ఆలోచనల్లో ఏ ఐన్‌స్టీనో దాగి ఉండొచ్చు. వింటేనే కదా తెలిసేది.
స్నేహితుల్లా మెలగండి: పిల్లలను ఎప్పుడూ శత్రువుల్లా చూడొద్దు. మార్కులు తక్కువొచ్చాయనీ, ఆటల్లో ఆసక్తి కనబర్చడం లేదని నిందించ వద్దు. సందేహాలు తీర్చే స్నేహితుడిగా ఉండండి.
అండగా ఉండండి: మీ బిడ్డ ఏదైనా సమస్యలో ఉన్నట్లుగానీ, ఏ కారణం చేతనో ఇబ్బంది పడుతున్నట్లు గానీ అనిపిస్తే అండగా ఉండండి. ధైర్యం చెప్పండి.
కలిసి చదవండి: పిల్లలతో కలిసి చదువుకోవడం వల్ల ప్రాపంచిక విషయాలపై వారికి పట్టు పెరుగుతుంది. ఏకాగ్రత మెరుగవుతుంది. విశ్లేషణ శక్తి పదునుదేలుతుంది. రోజూ ఒక గంట పిల్లలతో కలిసి చదువుకోవడానికే కేటాయించండి.
చురుగ్గా కనిపించండి: పిల్లలకు తల్లిదండ్రులే రోల్‌మోడల్. మీరు చురుగ్గా ఉంటే వాళ్లూ అలాగే తయారవుతారు. మీరు రోజూ వ్యాయామం చేస్తే, వాళ్లూ మిమ్మల్ని చూసి ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకుంటారు.
సేవాభావం ముఖ్యం: సామాజిక బాధ్యత గురించి పిల్లలకు చిన్నప్పటి నుంచే బోధించాలి. పేదలు, వృద్ధులతో సమయం గడపడానికి ప్రయత్నిస్తే పిల్లలూ ఆ మార్గంలోనే నడుస్తారు.
ప్రకృతిని ప్రేమించండి: పర్యావరణ ప్రియమైన జీవనశైలిని అలవరుచుకోండి. ప్రకృతికి హాని కలిగించే పనులకు స్వస్తి పలకండి. దీని వల్ల కలిగే ప్రయోజనాలను పిల్లలకు వివరించండి.
మీ పిల్లలు ఫోన్లకు అతుక్కుపోతున్నారా? ఆ అలవాటు ఇలా మాన్పించండి”