Laryngitis | చిన్న పిల్లల్లో లారింక్స్ (స్వరపేటిక), ట్రాకియా (శ్వాసనాళం), బ్రాంకై (చిన్న శ్వాసనాళాలు).. అనే శ్వాస వ్యవస్థ భాగాలకు వచ్చే అంటువ్యాధులు కొన్నిసార్లు ప్రమాదకరంగా పరిణమించవచ్చు. పిల్లల్లో ఈ భాగాల పరిమాణం చాలా చిన్నగా ఉండటమే ఇందుకు కారణం. ఈ మూడు భాగాలకు సంక్రమించే వ్యాధుల లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. పొడిదగ్గు, గొంతు బొంగురు పోవడం ఎక్కువ. పిల్లల్లో వచ్చే శ్వాస సంబంధమైన వ్యాధులలో 1. లారింజైటిస్, 2. లారింగో ట్రాకియా బ్రాంకైటిస్, 3. ఎపిగ్లాటైటిస్ ప్రధానమైనవి. లారింజైటిస్, లారింగో ట్రాకియా బ్రాంకైటిస్ పారా ఇన్ఫ్లుయెంజా, ఇన్ఫ్లుయెంజా వైరస్ల వల్ల వస్తాయి. హెచ్.ఇన్ఫ్లుయెంజా-బి అనే బ్యాక్టీరియా వల్ల ఎపిగ్లాటైటిస్ వస్తుంది.
♦ ముక్కు కారడం మొదలవుతుంది.
♦ ఒకటి నుంచి మూడు రోజులు పొడిదగ్గు ఉంటుంది.
♦ గొంతు బొంగురు పోతుంది.
గాలి పీల్చినప్పుడు శబ్దం వస్తుంది. .. ఇవి కాకుండా ఆయాసమూ ఇబ్బంది పెడుతుంది. అర్ధరాత్రి సమస్య తీవ్రంగా ఉంటుంది. పిల్లలు అకస్మాత్తుగా నిద్ర లేస్తారు. శ్వాసనాళాలు పూర్తిగా మూసుకు పోవడంతో ఆయాసం ఎక్కువై ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. కాబట్టి, వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
– డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి, పిల్లల వైద్య నిపుణులు
“పిల్లల కాలేయాన్ని కబళించే రాకాసి జన్యువ్యాధి ‘పి-ఫిక్’”
“మీ పిల్లలు తినట్లేదా? ‘పరోస్మియా’ కావొచ్చు!”
“చిన్నపిల్లల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు ఇవే.. వీటిని ఇలా గుర్తించొచ్చు”