బాబోయ్.. బ్రాంకియోలైటిస్!
ఇది చిన్నపిల్లల్లో కనిపించే సర్వసాధారణ శ్వాస సంబంధ వ్యాధి. రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్, ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా, ఎడినోవైరస్, రైనో వైరస్.. అనే సూక్ష్మ జీవులు ప్రధాన కారకాలు. వర్ష కాలంలో, చలి కాలంలో బాగా కనిపిస్తుంది. రెండేండ్ల లోపు పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ. కానీ 80 శాతం మరణాలు ఆరునెలల లోపు పిల్లల్లోనే సంభవిస్తాయి
ఇది చిన్నపిల్లల్లో కనిపించే సర్వసాధారణ శ్వాస సంబంధ వ్యాధి. రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్, ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా, ఎడినోవైరస్, రైనో వైరస్.. అనే సూక్ష్మ జీవులు ప్రధాన కారకాలు. వర్ష కాలంలో, చలి కాలంలో బాగా కనిపిస్తుంది. రెండేండ్ల లోపు పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ. కానీ 80 శాతం మరణాలు ఆరునెలల లోపు పిల్లల్లోనే సంభవిస్తాయి. డే కేర్ సెంటర్లలో పెరిగేవారు, ఇరుకిరుకు నివాసాలలో ఉండేవారు, నెలలు నిండకముందే జన్మించినవారు, గుండె జబ్బులతో పుట్టినవారు, పోషక విలువల లోపాలు ఉన్నవారి విషయంలో ఈ వ్యాధి తీవ్రస్థాయికి చేరుతుంది.

లక్షణాలు
జలుబు, జ్వరంతో ప్రారంభమై దగ్గు, ఆయాసంలోకి దించుతుంది. దీనివల్ల పాలు తాగడం కష్టం అవుతుంది. ఊపిరి తీసుకున్నప్పుడు శబ్దం బయటికి వినిపించవచ్చు. వ్యాధి తీవ్రమైనప్పుడు శ్వాస ఆగిపోవడం, శరీరంలో ఆక్సిజన్ పరిమాణం అకస్మాత్తుగా తగ్గడం తదితర విపరిణామాల వల్ల మరణమూ సంభవించవచ్చు. శ్వాసక్రియ వేగం అసాధారణంగా ఉన్నప్పుడు, పాలు తాగడం కష్టంగా ఉన్నప్పుడు ఆసుపత్రిలో ఉంచి వైద్యం చేయించడమే సురక్షితం.
వైద్యం
ముక్కు తరచుగా శుభ్రం చేయాలి. తగినన్ని ద్రవ పదార్థాలు ఇవ్వాలి. తల, ఛాతీభాగం 30 డిగ్రీలు ఏటవాలుగా ఉండేలా కూర్చోబెడితే శ్వాస సులభంగా ఆడుతుంది. ఇంటి వద్దే ఉంచి వైద్యం చేయిస్తున్నప్పడు శ్వాసక్రియ వేగం పెరగడం, శరీరం నీలం రంగులోకి మారడం వంటి మార్పులను గమనిస్తూ ఉండాలి. ఇవి ప్రమాద చిహ్నాలు. 48- 72 గంటల లోపు వ్యాధి తీవ్రత పెరిగే ఆస్కారం ఉంది. దాదాపు 10-12 రోజుల తరువాత అదే తగ్గుముఖం పడుతుంది. ఈ రుగ్మత పాలైన శిశువులకు భవిష్యత్తులో ఉబ్బసం వ్యాధి వచ్చే ఆస్కారం ఎక్కువ.
వ్యాప్తి
ఈ వ్యాధి ఇట్టే వ్యాపిస్తుంది. దగ్గు, తుమ్ముల వల్ల నోటినుంచి వచ్చే లాలాజల బిందువుల ద్వారా విస్తరిస్తుంది. ఇంట్లోని పెద్ద పిల్లలకు వస్తే వారం రోజుల లోపే మిగతా పిల్లలకూ రావచ్చు.
– డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Bronchiolitis
- Children
- Infants
- kids
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

