Children Addict to Smart phone | ఆన్లైన్ క్లాసుల కారణంగా పిల్లలు స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లకు బాగా అలవాటు పడిపోయారు. స్కూళ్లు మొదలయ్యాక కూడా గ్యాడ్జెట్లను వదల్లేక పోతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. కొందరైతే తమ పిల్లల అలవాటును మాన్పించేందుకు సైకాలజిస్ట్‌లను ఆశ్రయిస్తున్నారు.
నిజానికి పిల్లలకు ఈ స్మార్ట్ గ్యాడ్జెట్లు అలవాటు చేసింది పెద్దవాళ్లే. కాబట్టి ఈ విషయంలో పిల్లల్ని మాత్రమే నిందించడానికి వీల్లేదు. కొంచెం కష్టమైనా ఓపికతో పిల్లల్లో మార్పు తీసుకురావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బడి నుంచి రాగానే పిల్లల్ని దగ్గర్లోని పార్కుకు తీసుకెళ్లి ఆడించడం, స్విమ్మింగ్ నేర్పించడం, ఆటలు, సంగీతంలో శిక్షణ ఇప్పించడం వల్ల పిల్లలకు ఫోన్‌పై ధ్యాస తగ్గుతుంది. వీలైనంత ఎక్కువ సమయం పిల్లలకు కేటాయించండి. కాస్త పెద్ద పిల్లలైతే ఇంటి పనులు పురమాయించండి. ఈ పద్ధతులు పాటించడం వల్ల చిన్నారులను స్మార్ట్‌గా గ్యాడ్జెట్లకు దూరం చేయవచ్చు.
Toys and Tales | మీ పిల్లలకు ఖరీదైన బొమ్మలు కొనలేరా? అయితే ఇక్కడ అద్దెకు తీసుకోండి”
“చిన్నపిల్లల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు ఇవే.. వీటిని ఇలా గుర్తించొచ్చు”
“ఇంట్లో ఉండాలని లేదు.. హాస్టల్లో చేరతానంటే ఒప్పుకోవట్లేదు.. 16 ఏండ్ల అమ్మాయి ఆవేదన”