Ugadi Panchangam 2022 | తెలంగాణ గడ్డకు శుభం. రాజు మరింత శక్తిమంతుడు అవుతాడు. తెలంగాణ బిడ్డకు శుభం. ఆయురారోగ్యాలతో తులతూగుతాడు. తెలంగాణ నేలకు శుభం. సాగునీరు పుష్కలం. తెలంగాణ రైతుకు శుభం. రాజే రైతు కాబట్టి, రైతుకు రాజభోగాలే. తెలంగాణ ఉద్యోగార్థికి శుభం. కొలువులు వరిస్తాయి. తెలంగాణ మహిళకు శుభం. సంక్షేమ పథకాలు సాయమందిస్తాయి. యాదాద్రి నరసన్న, వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న, భద్రాద్రి రామన్న.. ఇంటి దేవుళ్ల ఆశీస్సులు కంటికి రెప్పలవుతాయి.
ఈ ఏడాది ఖర్చులు ఎక్కువ. అయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఆ ఖర్చులన్నీ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇస్తాయి. పిల్లల చదువు, వివాహం, గృహ నిర్మాణం, భూమి కొనుగోలు ఇలాంటి మంచి విషయాలకు డబ్బు వినియోగిస్తారు. వ్యాపారులకు మేలు జరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలకు చేయూతనిస్తారు. విద్యార్థులు శ్రమించాలి. కష్టానికి తగ్గ ఫలితం పొందుతారు. ఆంత్రప్రెన్యూర్లు ఒకమెట్టు పైకి ఎదుగుతారు. ఆలోచనలను అమలు చేయడంలో విజయవంతం అవుతారు. హోటల్, హార్డ్వేర్ రంగాల్లో ఉన్నవారికి మరింత మంచికాలం.
పట్టిందల్లా బంగారం అవుతుంది. నూతన గృహయోగం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలపై మనసు నిలుపుతారు. ఉద్యోగంలో పదోన్నతి అవకాశం ఉంది. రుణ బాధలు తొలగిపోతాయి. శ్రమ పెరుగుతుంది. అందుకు తగ్గ ఫలితాలు పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం వరిస్తుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయం అవుతుంది. మొత్తంగా ఈ ఏడాది శుభకరంగా ఉంటుంది.
ఈ ఏడాది అష్టమ శని నుంచి విముక్తి లభించనుంది. దీనికి తోడు గురుబలం జతకానుంది. సత్ఫలితాలు పొందుతారు. స్థిరాస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగులు సహనంతో ఉండాలి. ఆరోగ్యం విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆహార నియమాలు పాటించడం అవసరం. చేపట్టిన పనులు ఆలస్యంగా నెరవేరుతాయి. రాహువు అనుగ్రహం ఉంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.
చాలా రోజులుగా ఇబ్బంది పెడుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పెండ్లీడు వారికి కల్యాణ యోగం. తీర్థయాత్రలు చేస్తారు. దైవబలం పెరుగుతుంది. ఏడాది ప్రథమార్ధంలో శనైశ్చరుడి వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ద్వితీయార్ధంలో విదేశయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించి అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఇంట్లో మార్పుచేర్పులకు అవకాశం.
గురువు మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కోపాన్ని నిగ్రహించుకుంటే సత్ఫలితాలు పొందుతారు. నూతన గృహ యోగం ఉంది. రుణ బాధలు తీరుతాయి. శత్రు బాధలు దూరమవుతాయి. ఆభరణాలు, ధనం జాగ్రత్త చేయడంలో ఆశ్రద్ధ వద్దు. ప్రయాణాల వల్ల అలసట ఎదుర్కొంటారు. వీలైతే వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక విష
యాల్లో ఇతరులకు హామీగా ఉన్నా, రుణాలు ఇచ్చినా సమస్యలు కొనితెచ్చుకున్నట్టే. అలాంటి నిర్ణయాలకు దూరం పాటించండి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు.
గురువు సత్ఫలితాలు ఇస్తాడు. ఆర్థికంగా అంచెలంచెలుగా ఎదుగుతారు. గృహ నిర్మాణం చేపడతారు. పెండ్లీడు వారికి కల్యాణ యోగం బలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఇతరులకు సాయం చేస్తారు. అనేక శుభవార్తలు వింటారు. శని మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. రుణ బాధలు దూరం అవుతాయి. చాలాకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావచ్చు. కుటుంబంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుంది.
పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో చిన్నచిన్న చికాకులు ఎదురవుతూ ఉంటాయి. ద్వితీయార్ధంలో ఆర్థికంగా పుంజుకుంటారు. బాకీలు తీరిపోతాయి. ఉద్యోగులకు స్థానచలన సూచన. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. విదేశయానానికి అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారంతో కొత్త పనులు చేపడతారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. డబ్బును పొదుపుగా వాడతారు.
ఉద్యోగంలో దినదినాభివృద్ధి సాధిస్తారు. పదోన్నతి పొందే అవకాశాలు అపారం. స్థాన చలన సూచన. చాకచక్యంగా వ్యవహరించి అధికారుల మన్ననలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఖర్చుల నియంత్రణ అవసరం. దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఉద్యోగులకు అనుకూల స్థాన చలన సూచన. పనిలో బాధ్యతలు పెరిగినప్పటికీ, సమర్థవంతంగా పూర్తిచేస్తారు. బంధు మిత్రులతో కఠినంగా మాట్లాడొద్దు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా సఫలం అవుతాయి. ఏడాది ద్వితీయార్ధంలో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు అమలుచేస్తారు. మీ శక్తిసామర్థ్యాలు ఇతరులు గుర్తిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. కొత్త వస్తువులు, ఆభరణాలు కొంటారు. శుభకార్య ప్రయత్నాలు వేగంగా నెరవేరుతాయి.
ఉద్యోగంలో పూర్వవైభవం పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబసభ్యుల మాటకు విలువ ఇవ్వండి. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆడవాళ్లతో తగాదాలు ఏర్పడవచ్చు. మాట జారకుండా ఉండండి. భారీ పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఇంట్లో మార్పులు కోరుకుంటారు. ఉద్యోగంలో గుర్తింపు పొందుతారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. కొత్తగా పరిచయమైన వ్యక్తుల వల్ల కొన్ని పనులు నెరవేరుతాయి.
ఈ ఏడాది గురువు వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేస్తారు. శుభవార్తలు వింటారు. ఏల్నాటి శని ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని పనులు వాయిదా వేసుకోవడం మంచిది. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మకండి. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో జాగ్రత్త అవసరం. అవకాశాలను చేజార్చుకోవద్దు.
వృత్తి, వ్యాపారాల్లో నిదానంగా అభివృద్ధి సాధిస్తారు. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. శుభకార్యాల కారణంగా డబ్బు ఖర్చవుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారులకు మంచి కాలం. ధనలాభం ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇచ్చే పనులకు శ్రీకారం చుడతారు. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. ఆత్మీయుల సహకారంతో పనులు నెరవేరుతాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉండబోతుంది?
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో పెండ్లిళ్లకు శుభ ముహూర్తాలు ఇవే..
Panchangam 2022 | తారాబలం ఎలా చూడాలంటే..
ఈ కొత్త సంవత్సరంలో శని ఏ రాశిలో ఉంటాడు? రాహు కేతువుల సంచారం ఎలా ఉంటుంది?
Ugadi 2022 | ఈ కొత్త సంవత్సరంలో వస్తువుల ధరలు ఎలా ఉండబోతున్నాయంటే..