Ugadi 2022 | చైత్రం: ఈ నెలలో నల్లనువ్వుల ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ధర పెరుగుతుంది. పత్తి, నూలు దారాల ధరలు మాస ప్రథమార్ధంలో పెరిగి, ద్వితీయార్ధంలో తగ్గుముఖం పడతాయి. వెండి, నూనె, బెల్లం, చక్కెర, పసుపు, దుంపల కూరగాయల ధరలు హెచ్చుతాయి. బంగారం ధర కొద్దిగా తగ్గి, మళ్లీ పెరుగుతుంది. పెసర్లు, కందులు, ఉలవలు, మిర్చి, కొబ్బరికాయలు, లోహాల ధరలు నిలిచి ఉంటాయి. మినుములు, గోధుమల ఉత్పత్తి అనుకూలంగా ఉండటంతో ధరలు అందుబాటులో ఉంటాయి.
వైశాఖం: నల్ల నువ్వులు, ధాన్యం, పత్తి, నూలు దారం, దుస్తులు, మినుములు, ఆవాలు, పెసర్లు, ఉల్లిపాయల ధరలు పెరుగుతాయి. చింతపండు, బెల్లం, నూనెల ధరలు తగ్గుతాయి. ఆలుగడ్డలు, అరటి, పసుపు ధరలు పెరిగి, నిలిచి ఉంటాయి. వెండి, బంగారం ధరలు నిలిచి ఉండి, తర్వాత తగ్గుముఖం పడతాయి. ద్రాక్ష, కొబ్బరి, మిర్చి ధరలు నిలిచి ఉంటాయి. మెంతులు, కంచు ధరలు తగ్గుముఖం.
జ్యేష్ఠం: బెల్లం, ధాన్యం ధరలు స్థిరంగా ఉంటాయి. పసుపు, కొబ్బరికాయల ధరలు తగ్గి, ద్వితీయార్ధంలో హెచ్చుతాయి. పప్పులు, నూలు, పట్టు దుస్తుల ధరలు నిలిచి ఉండి, ద్వితీయార్ధంలో తగ్గుతాయి. కూరగాయలు, నిత్యావసర వస్తువులు, నూనెల ధరలు పెరుగుతాయి. పప్పులు, ఉలవలు, మిర్చి, ఆలుగడ్డ, అరటి, ద్రాక్ష, యంత్ర పరికరాల ధరలు స్థిరంగా ఉంటాయి. కంచు, ఇత్తడి, మెంతులు, ఆవాల ధరలు తగ్గుతాయి. సిమెంట్, కలప ధరలు స్థిరంగా ఉండి, క్రమేణా పెరుగుతాయి.
ఆషాఢం: కొబ్బరికాయలు, ధాన్యం ధరలు తగ్గుతాయి. వెండి, బంగారం ధరలు స్థిరంగా ఉంటాయి. చక్కెర, బెల్లం ధరలు పెరిగి, తర్వాత తగ్గుముఖం పడతాయి. నూలు, పట్టు దుస్తుల ధరలు క్షీణిస్తాయి. పప్పు ధాన్యాల ధరలు తగ్గుతాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. అరటి, కందమూలాల ధరలు నిలిచి ఉంటాయి. పెసర్లు, జొన్నలు, మినుముల ధరలు ప్రథమార్ధంలో తగ్గి, ద్వితీయార్ధంలో పెరుగుతాయి.
శ్రావణం: వెండి, బంగారాల ధరలు పెరుగుతాయి. వేరుశనగ, కొబ్బరికాయల ధరలు స్థిరంగా ఉంటాయి. ఉల్లిపాయలు, బెల్లం ధరలు తగ్గుతాయి. పప్పు ధాన్యాల ధరలు హెచ్చుతాయి. నూలు, పట్టు దుస్తులు, మిర్చి, చింతపండు, యంత్ర పరికరాలు, ఇనుము ధరలు నిలిచి ఉంటాయి. జీడిపప్పు, ద్రాక్ష, జాజికాయ, జాపత్రిల ధరలు స్థిరంగా ఉంటాయి. గోధుమల ధర తగ్గవచ్చు.
భాద్రపదం: వెండి, బంగారం ధరలు స్థిరంగా ఉండి, క్రమేణా పెరుగుతాయి. బెల్లం, చక్కెరల ధరలు పెరుగుతాయి. పట్టు, నూలు దుస్తుల ధరలు తగ్గును. ధాన్యం, గోధుమలు, కొబ్బరి ధరలు పెరగవచ్చు. పసుపు, పప్పు జాతుల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు హెచ్చుతాయి. పశుగ్రాసం, ఉలవలు, ఆవాలు, మినుముల ధరలు నిలిచి ఉంటాయి. వేరుశనగ, సుగంధ ద్రవ్యాల ధరలు తగ్గుతాయి. యంత్ర పరికరాలు, ఇత్తడి, స్టీలు, కంచు ధరలు నిలిచి ఉంటాయి.
ఆశ్వయుజం: వెండి, బంగారం, ఉన్ని, గోధుమలు, రాగి, కందులు, పత్తి ధరలు నిలిచి ఉండి, తర్వాత పెరుగుతాయి. గడ్డి, పూలు, పండ్లు, పశువుల ధరలు నిలిచి ఉంటాయి. ద్రాక్షలు, ధాన్యం, కొబ్బరి, అరటి ధరలు పెరుగుతాయి. మినుములు, పెసర్లు, ఉలవలు, బెల్లం ధరలు తగ్గి, మళ్లీ పెరుగుతాయి. ఇత్తడి, చక్కెర, కంచు, చెరకు ధరలు నిలిచి ఉంటాయి. సుగంధ ద్రవ్యాలు, రత్నాలు, యంత్ర సామగ్రి, స్టీలు ధరలు తగ్గుతాయి.
కార్తికం: తమలపాకులు, ద్రాక్ష, ధాన్యం ధరలు తగ్గుతాయి. పండ్లు, సుగంధ ద్రవ్యాల ధరలు పెరుగుతాయి. వెండి, బంగారం, రాగి, గోధుమలు, కందులు, దూది, పట్టు వస్ర్తాలు, ఉన్ని ధరలు నిలిచి ఉంటాయి. పశువులు, పశుగ్రాసం, జొన్నలు, పువ్వుల ధరలు తగ్గుతాయి. కొబ్బరికాయలు, అరటి ధరలు పెరుగుతాయి. స్టీలు, ఇనుము ధరలు పెరుగుతాయి. నూనె, గృహనిర్మాణ వస్తువుల ధరలు క్రమేణా పెరుగుతాయి.
మార్గశిరం: ఆలుగడ్డలు, కొబ్బరి, అరటి ధరలు హెచ్చుతాయి. జొన్నలు, పశుగ్రాసం, పూల ధరలు తగ్గుముఖం పడతాయి. వెండి, బంగారం, రాగి, గోధుమలు, కందులు, దూది, పట్టు దుస్తులు, ఉన్ని ధరలు పెరుగుతాయి. ధాన్యం, బెల్లం, ఉల్లిపాయలు, పెసర్లు, ఉలవ ల ధరలు తగ్గుతాయి. ఆవాలు, మినుముల ధరలు నిలిచి ఉంటాయి.
పుష్యం: గేదెలు, ఆవులు, జొన్నలు, పూల ధరలు నిలిచి ఉంటా యి. బంగారం, వెండి, రాగి, గోధుమలు, దూది, కందులు, పట్టు, ఉన్ని ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. మినుములు, బెల్లం, ఆవాల ధరలు తగ్గుతాయి. అరటి, కొబ్బరికాయల ధరలు అందుబాటులో ఉంటాయి. ఇనుము, కంచు, ఇత్తడి, యంత్ర పరికరాల ధరలు స్థిరంగా ఉంటాయి.
మాఘం: వెండి, బంగారం, రాగి, గోధుమలు, కందుల ధరలు తగ్గుతాయి. పట్టు, దూది, పశుగ్రాసం, జొన్నలు, పూల ధరలు హెచ్చుతాయి. మినుములు, ఆవాలు, చెరకు, చక్కెర, ఇత్తడి, కంచు, స్టీలు, ఇనుము, రత్నాలు, సుగంధ ద్రవ్యాలు, నూనెల ధరలు నిలిచి ఉంటాయి.
ఫాల్గుణం: సుగంధ ద్రవ్యాలు, నవరత్నాలు, ఆవాలు, మినుముల ధరలు తగ్గుతాయి. చక్కెర, బెల్లం, కంచు, ఇత్తడి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. వెండి, బంగారం, దూది, పట్టు, ఉన్ని, పెసర్లు, ఉలవల ధరలు అందుబాటులో ఉంటాయి. జొన్నలు, పూలు, పశువులు, పశుగ్రాసం ధరలు పెరుగును. స్టీలు, పండ్ల ధరలు తగ్గి, అందుబాటులోకి వస్తాయి. నిత్యావసర వస్తువుల ధరలు నిలిచి ఉంటాయి.