Priyanka Chopra | బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా దంపతులకు ఆరునెలల క్రితం ఆడపిల్ల పుట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల తన ముద్దుల మనవరాలి సంగతులను మీడియాతో పంచుకున్నారు ప్రియాంక తల్లి మధుమాలతి చోప్రా.
మధుమాలతి ఆర్మీ ఆసుపత్రిలో సర్జన్‌గా పనిచేశారు. ప్రియాంక పాపాయికి ‘మాలతి మేరీ చోప్రా జోనస్’ అని నామకరణం చేశారు. మనవరాలికి తన పేరు పెడుతున్న సంగతి ఆ రోజు దాకా తెలియదనీ, ప్రియాంక మామగారు పాపాయి చెవిలో ఆ పేరు చెప్పినప్పుడు తాను ఆనందాశ్చర్యాలకు గురయ్యాననీ అన్నారు మాలతి. ఈ సందర్భంగా ప్రియాంక బాల్య జ్ఞాపకాలనూ పంచుకున్నారు. ‘నేను చిన్నప్పటి నుంచి చదువు, కెరీర్‌లాంటి వాటి మీద శ్రద్ధ పెట్టేదాన్ని. మా అమ్మా నాన్న నన్ను అలాగే పెంచారు. అయితే పెళ్లయి సంప్రదాయబద్ధమైన కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టాక కెరీర్‌ను కొనసాగించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్లాను.
నేను, మా వారు ఒకేసారి బయటికి వెళ్లాల్సి రావడం చాలా అరుదు. ఆ పరిస్థితి ఎదురైతే.. నేను ప్రియాంకను నాతో పాటు ఆసుపత్రికి తీసుకెళ్లేదాన్ని. నైట్ షిఫ్ట్‌లలో తను నాతోనే ఉండేది. అలాంటప్పుడే మన వృత్తి పట్ల పిల్లలకు గౌరవం పెరుగుతుంది. ప్రియాంకను టీనేజీలో విదేశాలకు పంపాల్సి వచ్చినప్పుడు చాలా మంది అడ్డుచెప్పారు. కానీ, నా పెంపకం మీద నమ్మకంతో తన కోరికను కాదనలేకపోయాను’ అంటారామె. పసిపిల్లలకు గ్యాడ్జెట్లు ఇవ్వడం ప్రమాదకరం. ప్రియాంకతో పోట్లాడి మరీ మనవరాలిని వాటికి దూరంగా ఉంచుతున్నారు మధుమాలతి. ఈ మధ్య పుట్టిన పిల్లలకు ఇలాంటి అమ్మమ్మ అవసరమే మరి!
Priyanka Chopra: ప్రియాంక చోప్రా ఫ్యామిలీలో అత్యంత ధనవంతుడైన జోనాస్ ఎవరు?”
“18 ఏళ్ల వయసులో.. బీచ్‌లో ప్రియాంకా చోప్రా.. ఫోటో వైరల్”