Priyanka Chopra | సెలెబ్రిటీలు ఏ చిన్న పనిచేసినా అది హాట్ టాపిక్‌గా మారిపోతుంది. ఇటీవల బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా చేసిన పని కూడా ఇలానే పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా? ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన పేరు చివర భర్త పేరు ‘జోనాస్’ తీసేసింది. దీంతో నెట్టింట పెద్ద దుమారమే రేగింది.
ప్రియాంక, నిక్ జోనాస్ ఇద్దరూ విడిపోబోతున్నారంటూ వదంతులు వ్యాపించాయి. అయితే ఈ కామెంట్లపై ప్రియాంక గానీ, నిక్ కానీ స్పందించలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రియాంకకు ఈ ప్రశ్న ఎదురైంది.
దీనిపై స్పందించిన ఈ ‘మేరీకోమ్’ నటి.. ‘నా ట్విటర్ హాండిల్‌కు ఉండే పేరే ఇన్‌స్టాకు కూడా ఉండాలని మార్చాను. అంతకుమించి ఏం లేదు. ఇలాంటివి కూడా జనాలకు పెద్ద విషయాలుగా కనిపించడం చూస్తే నవ్వొస్తుంది. ఇది జస్ట్ సోషల్ మీడియా.. జస్ట్ చిల్ అవుట్’ అని వెల్లడించింది. దీంతో భర్త ఇంటి పేరు తొలగించడంపై వచ్చిన వదంతులకు పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.