Jyoti | ఒకప్పుడు రోడ్లపై భిక్షమెత్తుకుంది.. ఇప్పుడు ఓ కంపెనీకి మేనేజర్ అయ్యింది
Orphanage girl Jyoti | చెత్తకుప్పలో దొరికిన పసిగుడ్డును ఓ యాచకురాలు అక్కున చేర్చుకున్నది. తనే ఓ పేరు పెట్టింది. తనతోపాటు భిక్షాటనకు తీసుకెళ్లేది. అంతలోనే ఆమె మరణించింది. ఆ బాలికకు ఒక శరణాలయం నీడనిచ్చింది. అక్షరాలు నేర్పింది. ప్రస్తుతం ఆ అనాథ ఓ కెఫేలో మేనేజర్!
పందొమ్మిది సంవత్సరాల క్రితం బీహార్ రాజధాని పాట్నాలో ఓ సంఘటన జరిగింది. ఏం కష్టమొచ్చిందో పాపం, బిడ్డను చెత్తకుప్పలో పడేసిపోయింది ఓ తల్లి. పసిగుడ్డు గుక్కపెట్టి ఏడుస్తున్నది. భిక్షమెత్తుకుంటున్న కరీదేవికి ఆ ఏడుపులు వినిపించాయి. అటూ ఇటూ చూసింది. గట్టిగా పిలిచింది. పాప కోసం ఎవరూ రాలేదు. తానే భిక్షమెత్తుకుని పొట్ట నింపుకొంటుంది. ఇక పాపనేం పోషిస్తుంది? కానీ, మనసు స్థిమితంగా ఉండనీయలేదు. పసిగుడ్డును అక్కున చేర్చుకున్నది. ఆ బిడ్డకు జ్యోతి అని పేరు పెట్టింది. అడుక్కుని కడుపునింపింది. వీధుల్లోనే పెంచి పెద్దచేసింది. ఆ అమ్మతో కలిసి భిక్షమెత్తుకుంటూ, చెత్త సేకరిస్తూ పెద్దదైంది జ్యోతి. ఆ అమ్మాయికి పన్నెండేండ్లు వచ్చేసరికి.. అనారోగ్యంతో కరీదేవి మరణించింది. దీంతో జ్యోతిని ‘రాంబో హోమ్ ఫౌండేషన్’ అనే సంస్థ చెంతన చేర్చుకున్నది.

నిర్వాహకులు జ్యోతికి చదువు నేర్పించారు. పదో తరగతి పరీక్షలు రాయించారు. తను మంచి మార్కులతో పాసైంది. పాట్నాలో ఒక ఆఫీస్‌లో పనికి చేరింది. అక్కడ ఉద్యోగం చేస్తూనే మార్కెటింగ్ కోర్సు చేసింది. కోర్సు పూర్తయిన తర్వాత ఆర్నెల్లు సేల్స్‌గర్ల్‌గా పనిచేసింది. ఇప్పుడు తనకు పందొమ్మిదేండ్లు. జ్యోతి ప్రతిభ గురించి తెలుసుకున్న ‘లెమన్ కేఫ్ ( Lemon Cafe )’ అనే రెస్టారెంట్ యాజమాన్యం మేనేజర్‌గా అవకాశం ఇచ్చింది. జ్యోతి తన సంపాదనలో సగం డబ్బును ‘రాంబో హోం ఫౌండేషన్’కు విరాళంగా ఇస్తున్నది. పాట్నా జంక్షన్లో భిక్షమెత్తుకున్న జ్యోతి చదువుతో తన జీవితాన్ని మార్చుకొన్నది. అక్షరాల ఆసరాతో తలరాతను తిరగరాసుకున్నది. ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది.
Read More :
“Debanji ghosh | భారత ఐటీ రంగానికి ఈమె టార్చ్‌బేరర్”
“ఒక్క అవకాశం ఆ స్త్రీమూర్తులను సిరి మహాలక్షులుగా మార్చేసింది”
“Kanika Reddy | విమానయాన సంస్థకే సీఈవో అయిన ఈమె ఎంతోమంది మహిళలకు ఇన్స్పిరేషన్”
“Manasa Varanasi | ప్రపంచ సుందరి కాలేకపోయినా.. మనసు మాత్రం బంగారం”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- inspiration
- jyoti
- orphan
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

