Manasa Varanasi | అందాన్ని లీటర్లలో కొలవలేం. కిలోల్లో తూచలేం. అందులోనూ, ఆత్మ సౌందర్యాన్ని మామూలు కళ్లతో చూడలేం. హృదయ నేత్రాలు తెరుచుకుంటే కానీ.. దర్శించుకోలేం. హైదరాబాద్ అమ్మాయి మానస వారణాసికి ప్రపంచ సుందరి కిరీటం దక్కకపోవచ్చు. ఆ వరుసలో ఏ పదమూడో స్థానానికో పరిమితమై ఉండవచ్చు. కానీ, తన సేవా కార్యక్రమాలతో మానస చాలామనసులనే గెలుచుకుంది.
ప్రపంచ సుందరి స్థానానికి పోటీపడిన యువతిగా నేను అందం గురించి మాత్రమే కాదు, సమాజం గురించీ ఆలోచిస్తాను. ఆ బాధ్యతతోనే కొవిడ్ సమయంలో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. హైదరాబాద్‌లోని చాలా బస్తీలు తిరిగాను. నిరుపేదల కష్టాలు విన్నాను. మార్పు కోసం నా వంతు ప్రయత్నం చేశాను. ‘రెయిన్బో హోమ్స్’ అనే శరణాలయంలో టీచర్‌గా పాఠాలు చెప్పాను. పేద, అనాథ పిల్లలకు గణితం నేర్పాను. మూడు పూటలా తిండి దొరకనంత కాలం.. రెండు ఒకట్లు రెండు అన్న సంగతి ఆ పసిబుర్రలకు ఎక్కదని అప్పుడే అర్థమైంది నాకు. ఆకలి చాలా తీవ్రమైన సమస్య. ఆ బాధ తట్టుకోలేక బడి వయసులోనే ఏదో ఓ పనికి కుదురుతున్నారు. అలాంటి పిల్లల్ని గుర్తించి, పాఠశాలలకు పంపేందుకు బాలల సంక్షేమ బృందాలు ఎంతో చురుగ్గా పనిచేస్తున్నాయి.
నా దృష్టిలో విజయం అంటే.. కిరీటమే కాదు! నా కార్యక్రమాల వల్ల చిన్నారుల జీవితాలుమారిన ప్రతిసారీ ప్రపంచాన్ని గెలిచినంత ఆనందపడతాను.
కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరిని సంప్రదించాలో, ఏ నంబరుకు ఫోన్ చేయాలో పిల్లలకు తెలియదు. దీంతో అభంశుభం ఎరుగని బాల్యం వెట్టిలో మట్టి కొట్టుకుపోతున్నది. చిన్నారులు తమ కష్టాలు చెప్పుకొనేందుకు అనేక టోల్‌ఫ్రీ నంబర్లు ఉన్నాయి. వీటి గురించి చాలా మందికి అవగాహన ఉండటం లేదు. నా వంతుగా టోల్‌ఫ్రీ నంబర్లకు విస్తృత ప్రచారం కల్పించాను. వాటికి ఫోన్‌చేస్తే జిల్లా స్థాయిలో చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ సిబ్బంది తక్షణం స్పందిస్తారు. ఆ బిడ్డలను గడ్డు పరిస్థితుల నుంచి ఒడ్డుకు చేర్చే కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. వెట్టి ఊబి నుంచి బయట పడుతున్నప్పుడు చిన్నారుల కళ్లలో ఆనందాన్ని చూశాను. ఆ సంతృప్తి ముందు ప్రపంచ సుందరి కిరీటం కూడా చిన్నబోవాల్సిందే. కొన్నిసార్లు సొంత వాహనాలు లేకపోవడం వల్ల చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ సిబ్బంది ఆర్టీసీ బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తున్నది. ఆలస్యం అయ్యేకొద్దీ మానవ మృగాలు తప్పించుకునే అవకాశాలు ఎక్కువ. బాల్యం బుగ్గిపాలై పోతుంది. అందుకే, జిల్లా స్థాయి సిబ్బందికి వాహనాలు సమకూర్చే లక్ష్యంతో.. నా వంతుగా నిధులు సేకరించాను.
మిస్ వరల్డ్ పోటీల సమయంలో మెంటర్స్, ట్రైనర్స్, మిస్ ఇండియా ఆర్గనైజేషన్వాళ్లు నన్ను బాగా ప్రోత్సహించారు. ఫైనల్స్ కోసం ‘ఫాల్గుణి షైన్ పీకాక్’ బ్రాండ్ గౌన్ వేసుకున్నాను. ఈ ఏడాది అందాల పోటీలకు ఓ ప్రత్యేకత ఉంది. ర్యాంప్ మీదనే కాదు ఆన్‌లైన్‌లోనూ అందరికంటే ముందుండాలి. ‘మిస్ వరల్డ్ డిజిటల్ చాలెంజ్’లోనూ గెలుపు తప్పనిసరి. జయాపజయాల సంగతి ఎలా ఉన్నా.. సొంత వెబ్సైట్ ద్వారా వేల మందికి చేరువకావడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది.
“9999 మేకులపై 9 నిమిషాలు నాట్యం చేసిన లిఖిత.. ఎలా సాధ్యమైందంటే..”
Akanksha Sharma | ఐకియాలో ఉన్న ఒకే ఒక్క భారతీయ డిజైనర్ ఈమెనే.. తన గురించి ఈ విషయాలు తెలుసా”
“Akanksha Sharma | ఐకియాలో ఉన్న ఒకే ఒక్క భారతీయ డిజైనర్ ఈమెనే.. తన గురించి ఈ విషయాలు తెలుసా”
“Rajyalaxmi | పీహెచ్డీ చేసిన తొలి సంచార జాతి మహిళ ఈమెనే..”
Shark Tank India | అక్కడ ఒక్క ఐడియా చెప్తే చాలు.. మీ జీవితమే మారిపోతుంది !!”