Kanika Reddy | విమానయాన సంస్థకే సీఈవో అయిన ఈమె ఎంతోమంది మహిళలకు ఇన్స్పిరేషన్
Kanika Reddy | ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించడమే గొప్పని అనుకుంటాం. అలాంటిది ‘జెట్‌సెట్‌గో ( Jet set go )’ అనే విమానయాన సంస్థకు సీయీవో కావడం అంటే! పురుషాధిపత్యం రాజ్యమేలుతున్న గగనయానంలో.. సమస్యల మేఘాలను చీల్చుకుని తనకంటూ ఓ రాచమార్గం ఏర్పాటు చేసుకున్నది కనికారెడ్డి.
గగనయానం అంటేనే మగవాళ్ల రాజ్యం. ఇక్కడ ఆడవాళ్లకు అవకాశాలు తక్కువ. కానీ, ఆ రంగంలో ఓ పెద్ద కంపెనీ అయిన ‘జెట్‌సెట్‌గో’ వ్యవస్థాపకురాలు, సీయీవో ఓ మహిళ కావడం విశేషం! ఆకాశ రాణిగా కనికా టెక్రివాల్ రెడ్డి విజయం సాధారణమైంది కాదు. విద్యార్థి దశ నుంచీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆకాశమెత్తు ఎదిగింది కనిక. జెట్‌సెట్‌గో సంస్థ చార్టర్డ్ విమాన సర్వీసులు అందిస్తుంది. ఢిల్లీ కేంద్రంగా తన కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నది కనిక. హైదరాబాద్ నుంచి కూడా జెట్‌సెట్‌గో సర్వీసులు ఉన్నాయి. డిగ్రీ చదివేనాటికే ఆమె ఎయిర్మిడ్ ఏవియేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఉపాధ్యక్షురాలు. పట్టా అందుకున్నాక ఫ్రాన్స్‌లో ఎంబీఏ చేసింది. చదువుకుంటూనే ఏరోస్పేస్ రిసోర్స్లో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్‌గా పనిచేసింది. తర్వాత గ్లోబల్ ఏవియేషన్‌లో ఆపరేషన్స్ డైరెక్టర్‌గా చేరింది. భాగస్వాములతో కలిసి జెట్ సెట్‌గో ఏవియేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించింది. ఆమె జీవితంలో ఎన్నో సంక్షోభాలు. ఇరవై ఏండ్లు కూడా నిండకుండానే క్యాన్సర్ బారినపడింది. ఆత్మవిశ్వాసంతో ఆ వ్యాధిని అధిగమించింది. కెరీర్లో నీకు ఎదురైన ప్రతి ‘నో’నూ ఓ మెట్టుగా మార్చుకో, ‘ఎస్’గా తిరగరాసుకో.. అని పిలుపునిస్తున్నది కనిక.

భవిత హైదరాబాద్‌దే..
‘ప్రైవేట్ జెట్లకు ఆదరణ పెరుగుతున్నది. గత నాలుగైదు నెలల్లోనే దాదాపు యాభై విమానాల్ని భారతీయులు దిగుమతి చేసుకున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు తమకంటూ ఓ జెట్ ఉండాలని కోరుకుంటున్నాయి ’ అంటున్నదామె. ‘ప్రైవేట్ జెట్ సర్వీసులు అందించడానికి బేగంపేట విమానాశ్రయం చాలా అనుకూలం. నగరం మధ్యలో ఈ విమానాశ్రయం ఉండటం కలిసొచ్చే విషయం. ఇక శంషాబాద్ విమానాశ్రయానికి తిరుగేలేదు. అమెరికా నగరాల్లో సాధారణ రాకపోకల కోసం ఒక విమానాశ్రయాన్ని, ప్రైవేట్ జెట్స్ కోసం మరో విమానాశ్రయాన్ని ఉపయోగిస్తారు. భారత్‌లో ఈ తరహా అవకాశం ఒక్క హైదరాబాద్‌కే ఉంది’ అంటూ తెలంగాణ రాజధాని నగరాన్ని మెచ్చుకున్నారు.
Read More :
“Manasa Varanasi | ప్రపంచ సుందరి కాలేకపోయినా.. మనసు మాత్రం బంగారం”
“9999 మేకులపై 9 నిమిషాలు నాట్యం చేసిన లిఖిత.. ఎలా సాధ్యమైందంటే..”
Akanksha Sharma | ఐకియాలో ఉన్న ఒకే ఒక్క భారతీయ డిజైనర్ ఈమెనే.. తన గురించి ఈ విషయాలు తెలుసా”
“Rajyalaxmi | పీహెచ్డీ చేసిన తొలి సంచార జాతి మహిళ ఈమెనే..”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- inspiration
- women
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

