జంతువులు చిన్న వయసులో ఉన్నప్పుడు ఎంతో ముద్దొస్తుంటాయి. అవి చేసే చిలిపి పనులు మనకు ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుంటాయి. అవి మనలో ఒకరిగి ఇమిడిపోయి జీవిస్తుంటాయి. మనతో పోట్లాడేందుకు.. మన ఆహారం లాక్కునేందుకు పోటీ పడుతుంటాయి. మన ఇండ్లల్లోని పెంపుడు జంతువుల చిలిపి చేష్టలు మనకు అనుభవమే.
ఓ గున్న ఏనుగు ఎన్‌క్లోజర్‌లో పనిచేసే కార్మికుడిని సరదాగా ఆటపట్టించింది. ఆయనతో మజాక్లు చేసింది. పనిచేయనీయకుండా అడ్డుకున్నది. తల్లిచాటు పిల్లనంటూ పెద్ద ఎనుగు వెనకాలే నక్కింది. చివరకు ఆ పనివాడితో సరదాగా పోట్లాడింది. ఆయనను కిందపడేసి రెజ్లింగ్‌లో మాదిరిగా ఆయనపై కాస్సేపు ఉండిపోయింది. చివరకు నేనే గెలిచానోచ్.. అంటూ పనివాడి పైనుంచి పైకి లేచింది. ఈ ముద్దొచ్చే వీడియోను గన్నుప్రేమ్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే 93 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 11 వేలకుపైగా లైక్స్ అందాయి. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజెన్లు సో క్యూట్ గన్నూ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Affectionate Gannu wants to play with Hooman, but he is busy working
— Gannuprem (@Gannuuprem) April 8, 2021
Who will win? 🤭😝 pic.twitter.com/OFkr72FGKc
భారత్‌పై సైబర్ దాడులు చేసే సామర్థ్యం చైనాకుంది: సీడీఎస్ బిపిన్ రావత్
రేపు భారత్, చైనా మధ్య 11 వ రౌండ్ చర్చలు
జైలు నుంచి లేఖ రాయడం కొత్త వ్యూహమే : సంజయ్ రౌత్
కరోనా సెకండ్ వేవ్ : కొత్తగా మూడు లక్షణాలు.. తేలికగా తీసుకోవద్దు..
బ్రిటిష్ అసెంబ్లీలో బాంబులు వేసిన భగత్‌సింగ్, బటుకేశ్వర్.. చరిత్రలో ఈరోజు
కొవిడ్‌కు గురైనవారిలో నాడీ, మానసిక రుగ్మతలు
వావ్..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!
పరంబీర్సింగ్తో వాజ్ సన్నిహితంగా ఉండేవారు : కమిషనర్ నివేదిక
జవాన్ రాజేశ్వర్ విడుదలకు చర్చలు షురూ!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..