హైదరాబాద్, మార్చి 22(నమస్తే తెలంగాణ): తెలంగాణకు గేమ్ చేంజర్‌గా ప్రభుత్వం చెప్పుకొంటున్న ప్రాంతీయ రింగ్‌రోడ్డు(ట్రిపుల్ ఆర్) ఇప్పట్లో సాకారమయ్యేలా కనిపించడం లేదు. ఈ ప్రాజెక్ట్‌పై పూటకో ప్లాన్ తెరపైకొస్తున్న క్రమంలో ఎక్స్‌ప్రెస్‌వే కాకుండా సాధారణ హైవేగా మారుతున్నట్టు తెలుస్తున్నది. ఎక్స్‌ప్రెస్‌వేకు ఖర్చు ఎక్కువవుతున్నదనే ఉద్దేశంతో కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ దీన్ని భూసేకరణ పూర్తయ్యాక ఆరు లేన్ల సాధారణ హైవేగా నిర్మించాలని నిర్ణయించినట్టు సమాచారం. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం పనులు 2018లో మంజూరు కాగా, 2025 మార్చిలో పర్యావరణ అనుమతులొచ్చాయి. 61.52 కిలోమీటర్ల మేర ఎనిమిది లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించాలని ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇరువైపులా సర్వీస్ రోడ్డుతో పాటు నాలుగు లేన్ల యాక్సిస్ కంట్రోల్డ్-గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి డిసెంబర్ 2024లో టెండర్లు పిలిచారు. రూ.7,104కోట్ల వ్యయంతో ఈపీసీ పద్ధతిలో 5 ప్యాకేజీల్లో పనులు చేపట్టాలని నిర్ణయించారు.
ఫిబ్రవరి 2025లో టెండర్లు తెరువాల్సి ఉన్నప్పటికీ భూసేకరణ పూర్తి కాక పెండింగ్‌లో పడింది. ఆ తర్వాత రెండు ప్యాకేజీల్లో ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలని నిర్ణయించారు. ఇంకా టెండర్ల ప్రక్రియ పెండింగ్‌లోనే ఉండగా, తాజాగా ఎక్స్‌ప్రెస్‌వేకు బదులు సర్వీస్ రోడ్లు లేకుండా ఆరు లేన్ల సాధారణ హైవే నిర్మించాలని నిశ్చయించినట్టు తెలిసింది. వచ్చే 20 ఏండ్ల వరకు పెరిగే ట్రాఫిక్ అవసరాలకు 8 లేన్ల రోడ్డు అవసరం లేదని, అందుకే ఆరు లేన్లకు పరిమితం చేయాలని కేంద్రం నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. సాధారణ హైవే నిర్మిస్తే సర్వీస్ రోడ్డు లేక గ్రామాలు, పట్టణాలు, జనావాసాలున్నచోట నుంచి రహదారికి నేరుగా కనెక్టివిటీ ఉంటుంది. భూసేకరణ పూర్తికాకుండా పనులు చేపడితే కోర్టు కేసులుతో మధ్యలోనే నిలిచిపోయే అవకాశం ఉండటమే గాక పెరిగిన ధరలకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లించే పరిస్థితి లేదని కేంద్రం భావిస్తున్నది. అందుకే ఏ సమస్యా లేకుండా సాధారణ హైవే నిర్మించాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలిసింది.
సాధారణ హైవే, ఎక్స్‌ప్రెస్ వే మధ్య ప్రధాన తేడా
సాధారణ హైవే
ఎక్స్‌ప్రెస్ వే