న్యూఢిల్లీ, మార్చి 22 : అమెరికా నుంచి ఎల్పీజీ, రష్యా నుంచి ముడి చమురుతో బయల్దేరిన రెండు నౌకలు ఆదివారం మంగళూరు పోర్టుకు చేరుకున్నాయి. అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీతో బయల్దేరిన ‘పైక్సిస్ పయనీర్’ కార్గో నౌక మంగళూరు పోర్టుకు చేరుకుంది. ఇదే సమయంలో రష్యా నుంచి ముడి చమురు తీసుకొస్తున్న మరో నౌకను పోర్టుకు 18 నాటికల్ మైళ్ల దూరంలో నిలిపి ఉంచారు.
ఇక్కడ్నుంచి వీటిని మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌కు తరలించనున్నారు. గత 8 రోజుల్లో ఎల్పీజీ, ముడి చమురు కలిగిన ఐదు నౌకలు భారత్‌కు చేరుకున్నాయి. ఇంకా భారత్‌కు చెందిన 22 నౌకలు పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకుపోయాయని కేంద్రం తాజాగా తెలిపింది. సోమవారం నుంచి వినియో గదారులకు గ్యాస్ సమస్య ఉండదని, రాష్ర్టాలకు సరఫరాను 20 శాతం పెంచుతున్నట్టు కేంద్రం చెబుతున్నది.