e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, January 23, 2022
Home News Megha akash | ఆ టైంలో ఏం చేస్తున్నానో అర్థ‌మ‌య్యేది కాదు.. వింత‌గా అనిపించేది

Megha akash | ఆ టైంలో ఏం చేస్తున్నానో అర్థ‌మ‌య్యేది కాదు.. వింత‌గా అనిపించేది


megha akash | ‘లై’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది మేఘా ఆకాశ్‌. ఈ తమిళపొన్ను తొలి అవకాశం దక్కించుకున్నది తెలుగులోనే. ఆ వెంటనే ‘ఛల్‌ మోహన్‌రంగ’ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘పేట’ చిత్రంతో తమిళంలో అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళం, హిందీ ఇలా పలు భాషల చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నది మేఘా ఆకాశ్‌. అందం, అభినయం కలగలసిన ఈ నటి ఇప్పుడు వరుస సినిమా అవకాశాలతో బిజీగా మారిపోయింది.

నేను పుట్టింది, పెరిగింది చెన్నైలో. నా చదువంతా అక్కడే కొనసాగింది. లేడీ ఆండాళ్‌ విద్యాసంస్థలో ఇంటర్‌ వరకూ చదివాను. ఉమెన్స్‌ క్రిస్టియన్‌ కాలేజీలో విజువల్‌ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశా. నా బాల్య స్నేహితులతో ఇప్పటికీ అనుబంధం ఉంది. ముఖ్యంగా ఇంటర్‌ స్నేహితులతో మంచి రిలేషన్‌ ఉంది. చిన్నప్పటి నుంచీ యాక్టర్‌ కావాలని ఉండేది. అయితే డిగ్రీ చదువుతున్న రోజుల్లో ప్రకటనల రంగంలోకి రావాలనిపించింది. కాపీ రైటర్‌గా కెరీర్‌ ఎంచుకోవాలనుకున్నా. కానీ, అనుకోకుండా నటినయ్యాను.

- Advertisement -

కాలేజీ రోజుల్లో నా అవసరాలకు అమ్మావాళ్లను డబ్బు అడిగిన సందర్భాలు చాలా తక్కువ. నా పాకెట్‌ మనీ నేనే సంపాదించుకునేదాన్ని. మోడలింగ్‌ ద్వారా నా అవసరాలకు డబ్బు సమకూరేది. మోడలింగ్‌లో ఉండటంతో అడపాదడపా సినిమా అవకాశాలు కూడా వచ్చేవి. మొదట్లో నేను వాటిని సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, మంచి అవకాశం వస్తే తప్పకుండా ఆలోచిద్దాం అనుకున్నా! అదే సమయంలో ‘లై’, ‘ఛల్‌ మోహన్‌ రంగ’ సినిమా అవకాశాలు వెంటవెంటనే వచ్చాయి. సినిమా వాతావరణం మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించినా, తర్వాత్తర్వాత అలవాటైంది.

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో వింతగా అనిపించేది. ఏం చేస్తున్నానో కూడా అర్థమయ్యేది కాదు. నేను తెలుసుకునే లోపే రెండు సక్సెస్‌లు పలకరించేశాయి. నెమ్మదిగా అన్నీ నేర్చుకున్నా! తొలినాళ్లలోనే పెద్ద దర్శకులతో పనిచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఒకే రకం పాత్రలకు పరిమితం కావాలని లేదు. రకరకాల జానర్స్‌లో సినిమాలు చేయాలని ఉంది. అందుకే స్క్రిప్ట్‌ ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గారితో సినిమా అవకాశం వస్తుందని అస్సలు ఊహించలేదు. ఆయనతో నటించడం ఓ కల. కెరీర్‌ తొలిరోజుల్లోనే ‘పేట’ సినిమాతో అది నెరవేరింది. ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను. సహనటులకు ఆయన చాలా కంఫర్ట్‌ ఇస్తారు! పెద్ద స్టార్‌ అనే దర్పం కొంచెం కూడా కనిపించదు. చాలా గొప్ప వ్యక్తి.

ఈ మధ్య విడుదలైన ‘రాజరాజ చోర’ మంచి టాక్‌ సొంతం చేసుకుంది. నాలుగైదు చిత్రాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. ఇప్పటికైతే నా కెరీర్‌ సజావుగానే సాగిపోతున్నది. తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో టాలెంట్‌ ఉన్నవాళ్లు చాలామంది ఉంటారు. కానీ, నా ప్రతిభకు అదృష్టం కూడా తోడైందని అనిపిస్తుంటుంది.

ఫలానా లక్షణాలున్న వ్యక్తి భర్తగా రావాలని కోరుకోవడం లేదు. తెలివైనవాడై ఉండాలి, బాగా మాట్లాడాలి. అన్నిటికీ మించి ఉన్నత వ్యక్తిత్వం ఉండాలి. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తయినా,
కాకపోయినా ఫర్వాలేదు.

నాకు బోలెడన్ని అభిరుచులు ఉన్నాయి. నాలో సృజనాత్మకత కాస్త ఎక్కువే. హస్త కళాకృతులు చేయడం అంటే ఆసక్తి. పుస్తకాలు చదవడం అన్నా ఇష్టం. నటిని కాకపోయి ఉంటే కాపీ రైటర్‌ అయ్యుండే
దాన్నేమో!

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Megha Akash | చిరునవ్వుతో కుర్రకారు హృదయాలు కొల్లగొడుతున్న మేఘా ఆకాష్

ప్రేమ వివాహమే చేసుకుంటా!..మేఘా ఆకాశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

నాలుగో తరగతిలోనే ప్రేమ‌.. త‌న ఫ‌స్ట్ క్రష్‌ గురించి రివీల్ చేసిన మేఘా ఆకాశ్‌

RGV | మేఘా ఆకాష్‌ను నలభైఏళ్ల క్రితం చూసుంటే విడాకులు తీసుకోకుండా వుండేవాణ్ణి!

రజినీకాంత్ చిన్నపిల్లోడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నితిన్‌ హీరోయిన్

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement