ప్రేమ వివాహమే చేసుకుంటా!

‘మనిషిని వివిధ జీవనదశల్లో ప్రేమ మాత్రమే ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయడంలో ప్రేమదే ముఖ్యపాత్ర. అందుకే నా దృష్టిలో ప్రేమ చాలా గొప్పది’ అని చెప్పింది కథానాయిక మేఘాఆకాష్. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘డియర్ మేఘ’. అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజులు హీరోలుగా నటించారు. సుశాంత్‌రెడ్డి దర్శకుడు. సెప్టెంబర్ 3న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా ఇటీవల మేఘాఆకాష్ పాత్రికేయులతో ముచ్చటించింది. ఆమె చెప్పిన సంగతులివి…
నా కలల చిత్రం..
మహిళా ప్రధానమైన పాయింట్ ఇదని దర్శకుడు చెప్పినప్పుడు తొలుత భయపడ్డాను. లేడీ ఓరియెంటెడ్ కథలో రాణించాలంటే ఒత్తిడి ఉంటుందని భావించా. అయితే కెరీర్లో ఎదగాలంటే తప్పకుండా రిస్క్ చేయాలి… కొత్తదనంతో కూడుకున్న కథల్ని ఎంచుకోవాలనుకున్నా. కథలోని భావోద్వేగాలు, ప్రేమను కొత్త కోణంలో స్పృశించిన విధానం బాగా ఆకట్టుకుంది. ఇది నా కలల చిత్రమనే ఫీలింగ్ కలిగింది. అందుకే వెంటనే ఒప్పుకున్నా.
షరతులు లేని ప్రేమ..
కేవలం ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య పుట్టేదే ప్రేమ కాదు. ఎన్నో రకాలైన ప్రేమలుంటాయి. పవిత్ర ప్రేమ అంటే ఏమిటో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ముక్కోణపు ప్రేమకథా చిత్రమిది. షరతులు లేని ప్రేమ ఎలా ఉంటుందో ఆవిష్కరిస్తుంది. పాఠశాల రోజుల్లో నాతో కలిసి చదువుకున్న అబ్బాయితో ప్రేమలో పడ్డాను. ఆదే నా ఫస్ట్‌లవ్. అయితే ప్రేమంటే తెలియని చిరుప్రాయకావడంతో కొద్దిరోజుల్లోనే మర్చిపోయా. నేను తప్పకుండా ప్రేమ వివాహమే చేసుకుంటా. ప్రస్తుతం కథల ఎంపికలో నా ఆలోచనలు మారాయి. నా సౌకర్యమైన పరిధిని దాటి కొత్త కథల్ని ఎంపికచేసుకుంటున్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

