నాలుగో తరగతిలోనే ప్రేమ.. తన ఫస్ట్ క్రష్ గురించి రివీల్ చేసిన మేఘా ఆకాశ్

ఛల్ మోహన్ రంగా, లై, పేట లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన మేఘ.. ఈ మధ్యే రాజ రాజ చోర సినిమాతో వచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో మరోసారి ఈమె పేరు టాలీవుడ్ లో బాగానే వినిపిస్తుంది. పైగా తాజాగా డియర్ మేఘ అనే సినిమాతో కూడా వస్తుంది. ఈ సినిమా ప్రెస్ మీట్ లోనే తనకు కాబోయే వాడు అలా ఉండాలి.. ఇలా ఉండాలంటూ చెప్పుకొచ్చింది. తన ఫస్ట్ లవ్ గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అలాగే తన పెళ్లి విషయంలోనూ క్లారిటీ ఇచ్చేసింది ఈ భామ. అంతేకాదు తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా చెప్పేసింది.
వరుసగా ప్రేమ కథలు చేస్తున్న మేఘా ఆకాశ్‌ను.. మీ జీవితంలో ఉన్న ప్రేమ గురించి చెప్పమంటూ మీడియా మిత్రులు అడిగేశారు. దానికి ఆమె కూడా దాచుకోకుండా.. మొహమాట పడకుండా సమాధానం చెప్పింది. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఉంటుంది.. అలాగే తన జీవితంలోనూ ఉంది అంటూ తెలిపింది. నాలుగో తరగతి చదువుతుండగా తన పక్కన కూర్చునే అబ్బాయిపై ఇష్టం ఏర్పడిందని చెప్పుకొచ్చింది మేఘ. తన జీవితంలో అదే తొలి ప్రేమ అంటుంది ఈమె. ఆ తర్వాత చదువు అయిపోయింది. కొన్ని రోజులకు తనకు షారుక్ ఖాన్ అంటే ఇష్టం వచ్చేసిందని చెప్పుకొచ్చింది. ఇక తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా క్లారిటీ ఇచ్చింది. తనకు కాబోయే వాడు తనను తనలా ఉండనిస్తే చాలు.. ఇంకేం అక్కర్లేదు అంటుంది మేఘా ఆకాశ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Tollywood Drug case | ఎవరు ఏ తేదీన ఈడీ ముందు హాజరు కానున్నారు..?
మరో రీమేక్‌లో మెగాస్టార్ .. సొంత కథలపై చిరంజీవికి నమ్మకం పోయిందా ?
Shraddha Kapoor| శ్రద్దాకపూర్ వెడ్డింగ్‌పై శక్తికపూర్ ఏమన్నాడంటే..?
Bandla: ఎన్టీఆర్‌తో గొడవపై స్పందించిన బండ్ల గణేష్..!
హాలీవుడ్ నిర్మాతగా దీపికాపదుకొనే..?
హిమాలయాల్లో జ్యోతిక.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

