మరో రీమేక్‌లో మెగాస్టార్ .. సొంత కథలపై చిరంజీవికి నమ్మకం పోయిందా ?

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇటీవల చిరు బర్త్ డే సందర్భంగా వీటికి సంబంధించిన అప్డేట్స్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాకపోతే ఒక విషయం మాత్రం ఇప్పుడు అభిమానుల్ని కలవరపెడుతుంది. ఎందుకంటే చిరంజీవి చేస్తున్న సినిమాల్లో దాదాపు అన్నీ రీమేక్‌లే ఉన్నాయి. ఇది కాకుండా ఈయన మరో సినిమా రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఆచార్య.. బాబీతో కమిటైన సినిమాలు మినహాయిస్తే చిరంజీవి తర్వాత చేయబోయే సినిమాలన్నీ రీమేకులే. ఆచార్య తర్వాత వరసగా రెండు రీమేక్స్ చేయబోతున్నాడు చిరంజీవి. పైగా ఆయన పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన కథ కూడా రీమేకే. కత్తి రీమేక్ ఖైదీ నెంబర్ 150తో వచ్చాడు చిరంజీవి. ఆ తర్వాత సైరా కూడా చరిత్రే కానీ సొంత కథ కాదు. ఇప్పుడు కొరటాల ఆచార్య మాత్రమే స్ట్రెయిట్ సినిమా. తమిళంలో హిట్టైన వేదాళం.. మలయాళ బ్లాక్ బస్టర్ లూసీఫర్ రీమేక్స్ వెంటపడ్డాడు చిరంజీవి. వీటికి భోళా శంకర్, గాడ్ ఫాదర్స్ టైటిల్స్ కూడా ఖరారు అయిపోయాయి. 2022లోనే ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి. ఇప్పుడు తాజాగా అజిత్ సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎన్నై అరింధాల్ సినిమాను మెగాస్టార్ రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే ఈ సినిమా ఇప్పటికే తెలుగులో ఎంతవాడు గానీ పేరుతో విడుదలైంది. టీవీలో కూడా చాలాసార్లు ఈ సినిమా వచ్చింది. అయినా కూడా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి చిరు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. వెంకీ కుడుముల ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇది కాకుండా అజిత్ నటించిన విశ్వాసం సినిమాను కూడా మెగా హీరోలు రీమేక్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో పవన్, చిరంజీవిలలో ఎవరో ఒకరు రీమేక్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
చిరంజీవి లాంటి స్టార్ హీరో ఇలా వరసగా రీమేక్ సినిమాలు చేయడాన్ని అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ అంతగా భయం వెంటాడుతుందా లేదంటే నిజంగానే సొంత కథలను చిరంజీవి నమ్మడం మానేశాడా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మన టాలెంట్ ఎంకరేజ్ చేయకపోతే.. సొంత కథలు చేయకపోతే మన హీరోలు ఎందుకు ఇంక అంటూ పలువురు విమర్శిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Tollywood Drug case | ఎవరు ఏ తేదీన ఈడీ ముందు హాజరు కానున్నారు..?
Shraddha Kapoor| శ్రద్దాకపూర్ వెడ్డింగ్‌పై శక్తికపూర్ ఏమన్నాడంటే..?
Bandla: ఎన్టీఆర్‌తో గొడవపై స్పందించిన బండ్ల గణేష్..!
హాలీవుడ్ నిర్మాతగా దీపికాపదుకొనే..?
హిమాలయాల్లో జ్యోతిక.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

