ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు.
- బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ డిమాండ్
- ఎన్హెచ్ఎం జేఏసీ ధర్నాకు సంఘీభావం
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్హెచ్ఎం జేఏసీ కింద 17,500 మంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. గత 11 రోజులుగా సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారని గుర్తుచేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిందని అన్నారు. మూడేండ్లు అయినా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేసే ఎన్హెచ్ఎం ఉద్యోగుల ఆరోగ్యానికి భద్రత లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు.
కరోనా విపత్తు సమయంలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు ముందుండి సేవలు అందించారని గుర్తుచేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఓట్లు అడుగుతున్న కాంగ్రెస్ నేతలను తమ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని ఎన్హెచ్ఎం ఉద్యోగులు నిలదీయాలని క్రిశాంక్ పిలుపునిచ్చారు. మూడు టిమ్స్‌లు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను నాడు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించి ఆరోగ్యరంగానికి పెద్దపీట వేసినట్టు తెలిపారు. ప్రభుత్వ దవాఖానలను పక్కనబెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి వాళ్ల కుటుంబసభ్యులు నడిపిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ప్రేమ చూపిస్తున్నారని చురకలు అంటించారు. ఆరోగ్యశాఖ మంత్రి, హెల్త్ సెక్రటరీ, ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ కమిషనర్ ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని క్రిశాంక్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్హెచ్ఎం జేఏసీ డాక్టర్ మహేందర్‌రావు పుట్ట, ఆయా క్యాడర్ల ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

