రజినీకాంత్ చిన్నపిల్లోడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నితిన్ హీరోయిన్
రెండేళ్ల కింద రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన పేట సినిమాలో మేఘా ఆకాశ్ కూడా కీలక పాత్రలో నటించింది. ఆ సమయంలో రజనీకాంత్‌తో నటించడం తనకు జీవితంలో మర్చిపోలేని అనుభూతి అంటోంది ఈ ముద్దుగుమ్మ.

Megha akash | సూపర్‌స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాలి.. ఆయన వ్యక్తిత్వం కూడా ఆకాశం అంత అందంగా ఉంటుంది. ఎవరికి కష్టం వచ్చినా కూడా వెంటనే స్పందిస్తాడు సూపర్ స్టార్. ముఖ్యంగా అభిమానులను తన ప్రాణంలా చూసుకుంటాడు. తనకంటే చిన్న వాళ్లను ప్రేమతో ఆశీర్వదిస్తాడు. తనకంటే పెద్ద వాళ్ళను ఎంతో గౌరవిస్తాడు. తన సమవుజ్జీలతో ఎంతో స్నేహంగా ఉంటాడు సూపర్ స్టార్. ఆయనతో ఒక్కసారి నటిస్తే చాలు తమ జీవితం ధన్యం అయిపోతుందనుకునే నటులు కూడా ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా ఈ తరం నటీనటులకు రజనీకాంత్ తో నటించడం ఒక కల. అది ఎంతో మందికి మాత్రం తీరని కలగానే ఉండిపోతుంది. ఈ జనరేషన్లో చాలా తక్కువ మందికి మాత్రమే రజినీతో నటించే అవకాశం దక్కింది. అలాంటి వాళ్లలో మేఘా ఆకాశ్ కూడా ఒకరు. తాజాగా ఈమె డియర్ మేఘా సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లో పాల్గొన్న ఈమె.. రజినీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

రెండేళ్ల కింద రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన పేట సినిమాలో మేఘా ఆకాశ్ కూడా కీలక పాత్రలో నటించింది. ఆ సమయంలో రజనీకాంత్‌తో నటించడం తనకు జీవితంలో మర్చిపోలేని అనుభూతి అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఆయనతో నటించడం తనకు దొరికిన అదృష్టం అని.. దానికి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుకి జీవితాంతం రుణపడి ఉంటాను ఉంటుంది మేఘా ఆకాశ్. మరోవైపు ఆయన నడిచే నట గ్రంథాలయం అని కితాబిచ్చింది. లొకేషన్లో రజినీకాంత్ ఎలా ఉంటాడనే ప్రశ్నకు.. చిన్నపిల్లాడు అని సమాధానమిచ్చింది మేఘా ఆకాశ్. సూపర్ స్టార్‌ను చూస్తుంటే నిజంగానే చిన్నపిల్లాడిలాగే ఉంటాడు. సెట్లో అందరితో ఆయన ఉండే తీరు కూడా అలాగే ఉంటుంది.. చాలా సందడిగా అల్లరి చేస్తూ అందరిని ఆటపట్టిస్తూ ఉంటాడు అని చెప్పుకొచ్చింది మేఘా ఆకాశ్.
నితిన్ హీరోగా వచ్చిన లై సినిమాతో మేఘా ఆకాశ్ తన సినీ కెరీర్‌ను మొదలుపెట్టింది. ఆ తర్వాత ఛల్ మోహనరంగా సినిమాలోనూ నటించింది. ఆ తర్వాత కోలీవుడ్‌కు వెళ్లిన ఈమె.. ఇప్పుడు డియర్ మేఘాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఇవే కాకుండా రాజ రాజ చోర, గుర్తుందా శీతాకాలం, మను చరిత్ర సినిమాల్లోనూ మేఘా ఆకాశ్ నటిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో రానాకు అన్యాయం చేస్తున్నారా..?
సరికొత్త రికార్డులు సెట్ చేసిన మహేష్ బాబు
20 మిలియన్ల అభిమానాన్ని పొందిన రష్మిక
Prakash Raj Surgery | ప్రకాశ్ రాజ్‌కు సర్జరీ..అసలేం జరిగిందంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

