Bheemla nayak |పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో రానాకు అన్యాయం చేస్తున్నారా..?
bheemla nayak | సినిమాలో పవన్, రానా ఇద్దరి పాత్రలు కీలకమే. కానీ ఈ సినిమాను మల్టీస్టారర్‌గా ఎవరూ చూడటం లేదనేది ఇప్పుడు బయట వినిపిస్తున్న వాదన.

bheemla nayak | పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. వీటిలో రానాతో చేస్తున్న మల్టీస్టారర్ సినిమా కూడా ఉంది. అయ్యప్పనుమ్ కోషియుమ్ అనే మలయాళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్, రానా ఇద్దరి పాత్రలు కీలకమే. కానీ ఈ సినిమాను మల్టీస్టారర్‌గా ఎవరూ చూడటం లేదనేది ఇప్పుడు బయట వినిపిస్తున్న వాదన. మొదట్నుంచి ఇది పవన్ సినిమా అనే చాలామంది అంటున్నారు.. కానీ మల్టీస్టారర్ అనేది చాలా తక్కువమంది చెబుతున్న మాట. ఇక ఇప్పుడు సినిమా టైటిల్ విషయంలో కూడా ఇదే పద్ధతి కొనసాగుతుందనే ప్రచారం జరుగుతోంది. ఒకవిధంగా చెప్పాలంటే ఈ సినిమా విషయంలో రానాకు అన్యాయం జరుగుతోందంటూ దగ్గుబాటి అభిమానులు సోషల్ మీడియాలో ఓపెన్ అవుతున్నారు.
మలయాళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన అయ్యప్పునుమ్ కోషియుమ్ సినిమాకు రీమేక్ ఇది . ఆత్మ గౌరవానికి, అహానికి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథ. ఒరిజినల్లో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజు మీనన్ కీలక పాత్రల్లో నటించారు. అక్కడ రెండు పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. అందుకే టైటిల్లో కూడా ఇద్దరి పేర్లు ఉంటాయి. కానీ తెలుగు విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఎక్కువగా హైలైట్ అవుతున్నాడు. రానా దగ్గుబాటి కంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక ఇప్పుడు టైటిల్ విషయంలో కూడా కేవలం పవన్ పేరు వచ్చేలా పెడుతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు భీమ్లా నాయక్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఖచ్చితంగా రానాకు ఈ విషయంలో అన్యాయం జరిగినట్లేనని దగ్గుబాటి అభిమానులు అంటున్నారు.
మల్టీస్టారర్ కథను సింగిల్ స్టార్‌గా మార్చడం అనేది అంత ఈజీ కాదు. అయితే మొన్నటి వరకు ఈ సినిమాకు పరశురామ కృష్ణమూర్తి అనే టైటిల్‌ను పరిశీలించారు. ఇద్దరి పేర్లు వస్తున్నాయి కాబట్టి ఇది బాగుంది అంటూ అభిమానులు కూడా దీనికి ఓటేశారు. కానీ కొన్ని రోజులుగా పరశురామ కృష్ణమూర్తి పక్కకు వెళ్లి భీమ్లా నాయక్ తెరపైకి వచ్చింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఈ సినిమా 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bigg Boss 5 | బిగ్‌బాస్ ఈసారి ఆరు నెలలు కొనసాగుతుందా?
మరో క్రేజీ ఆఫర్ అందుకున్న బిగ్ బాస్ బ్యూటీ..!
క్లీవేజ్ షోతో అదరగొట్టిన జాన్వీ కపూర్.. పిక్స్ వైరల్
కూతురితో కలిసి సురేఖా వాణి రచ్చ మాములుగా లేదు-వీడియో
Bigg boss 5 |యాంకర్ రవి బిగ్ బాస్ ఎంట్రీపై నోరు జారిన లాస్య
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

