క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై అనేక పాత్రలు పోషించిన సురేఖా వాణి తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. అత్తగా, తల్లిగా, వదినగా, అక్కగా ఇలా డిఫరెంట్ రోల్స్ ప్లే చేసింది. అయితే ఎప్పుడైతే ఆఫర్స్ తగ్గాయో ఈ అమ్మడు కూడా సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టి తనపై పడేలా చేస్తుంది. పెద్ద తెరపై ఎంతో పద్దతిగా కనిపించిన సురేఖా వాణి సోషల్ మీడియాకి వచ్చే సరికి అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంది.
సురేఖా వాణి,ఆమె కూతురు సుప్రిత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు. సురేఖా వాణి అయితే కూతురితో పోటీ పడుతుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. భర్త సురేష్ తేజ చనిపోయిన తరువాత ఆ బాధను దిగమింగుతూనే కూతురుతో సరదాగా గడుపుతోంది సురేఖావాణి. వీలు కుదిరినప్పుడల్లా కూతురు సుప్రితతో కలిసి హాలిడే ట్రిప్స్, పబ్స్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది.
నేడు (ఆగస్టు 8) సుప్రిత పుట్టిన రోజు సందర్భంగా తల్లీకూతుళ్లిద్దరూ కలిసి జాలీగా గడిపారు. స్టైలిష్ డ్రెస్లలోఇద్దరు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ముఖ్యంగా మోడ్రన్ దుస్తులలో సుప్రిత కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అమ్మడు రానున్న రోజులలో వెండితెర ఎంట్రీ ఇవ్వనుందని ఈ మధ్య సురేఖా వాణి క్లారిటీఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే తన పుట్టినరోజు సందర్భంగా సుప్రిత.. ‘వయసు పెరుగుతుంది అంటే నేను వృద్ధాప్యంలోకి ఎంటర్ అవుతున్నట్లు కాదు.. ఇంకా పర్ఫెక్ట్ అవుతున్నట్లు’ అంటూ లాజిక్ మాట్లాడింది.