Anchor Ravi in Bigg boss 5 | బిగ్‌బాస్ సీజన్ 5 గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతే కాదు ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఒక లిస్ట్ కూడా చక్కర్లు కొడుతుంది. అందులో మొదట్నుంచి యాంకర్ రవి పేరు బాగా వినిపిస్తుంది. కానీ అటు యాంకర్ రవి .. ఇటు బిగ్ బాస్ నిర్వాహకులు ఎవరూ దీనిపై స్పందించలేదు. అయితే యాంకర్ లాస్య నోరు జారడంతో ఇప్పుడు రవి బిగ్‌బాస్ ఎంట్రీపై ఒక క్లారిటీ వచ్చింది.
రవి, లాస్యకి పదేళ్లుగా మంచి స్నేహం ఉంది. అయితే మధ్యలో కొన్నేళ్లపాటు దూరంగా ఉన్నా.. ఈ మధ్యే మళ్లీ కలిసిపోయారు. గత ఆర్నెళ్లుగా వరుసగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ జోడీకి ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి. ఇద్దరూ కలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే కనబడుట లేదు అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హోస్ట్ చేశారు. ఈ వేడుకకు రామ్‌గోపాల్ వర్మ, విజయేంద్ర ప్రసాద్ సహా చాలామంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ ఫంక్షన్లోనే రవి బిగ్‌బాస్ ఎంట్రీపై లాస్య నోరు జారింది.
కనబడుట లేదు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితో సరదాగా మాట్లాడుతూ.. నువ్వు కూడా తొందరలోనే కనిపించకుండా పోతావట కదా.. ఏదో హౌస్‌లోకి వెళ్తున్నావట కదా అంటూ నోరు జారింది లాస్య. దీంతో కంగారు పడిపోయిన రవి.. వెంటనే దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. నేను ఏ హౌస్‌కు వెళ్తా.. నా హౌస్‌కే వెళ్తా అంటూ బదులిచ్చాడు. లాస్య కూడా అదే అదే అంటూ కవర్ చేసింది. ఏదేమైనా కూడా అప్పటికే తెలియాల్సిన సీక్రెట్ మాత్రం తెలిసిపోయింది. లాస్య కూడా గత సీజన్లో బిగ్‌బాస్ హౌస్‌లో 70 రోజులకు పైగానే ఉండొచ్చిన సంగతి తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bigg Boss 5 | బిగ్‌బాస్ ఈసారి ఆరు నెలలు కొనసాగుతుందా?
మరో క్రేజీ ఆఫర్ అందుకున్న బిగ్ బాస్ బ్యూటీ..!
క్లీవేజ్ షోతో అదరగొట్టిన జాన్వీ కపూర్.. పిక్స్ వైరల్
కూతురితో కలిసి సురేఖా వాణి రచ్చ మాములుగా లేదు-వీడియో
శారద మృతి అంటూ రూమర్స్.. పనికి మాలిన వాళ్లే ప్రచారం చేశారని ఘాటు కామెంట్స్