Bigg Boss 5 | బిగ్‌బాస్ ఈసారి ఆరు నెలలు కొనసాగుతుందా?
బిగ్ బాస్ గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని గురించి అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. త్వరలో మొదలు కాబోతున్న ప్రోమో మాత్రం ప్రసారమవుతుంది

Bigg Boss Telugu Season 5 |బిగ్ బాస్ గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని గురించి అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. త్వరలో మొదలు కాబోతున్న ప్రోమో మాత్రం ప్రసారమవుతుంది. అయితే ఐదవ సీజన్‌ను మునుపటి సీజన్ కంటే మరింత గ్రాండ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. దీని కోసం స్టార్ మా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగానే ఉంది. కంటెస్టెంట్స్ విషయంలో కూడా ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, హీరోయిన్ ఇషా చావ్లా లాంటి క్రేజీ స్టార్స్ బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సీజన్ గురించి మరో మెంటల్ ఎక్కిపోయే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇప్పటి వరకు తెలుగులో బిగ్‌బాస్ 4 సీజన్స్ ముగిశాయి. అందులో మొదటి సీజన్ 70 రోజులకు పైగా జరిగింది. మిగిలిన మూడు సీజన్స్ 104 రోజులకు ముగించారు. అయితే ఐదో సీజన్ విషయాల్లో మాత్రం నిర్వాహకులు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరూ కనీసం ఊహించని స్థాయిలో ఏకంగా మరో రెండు నెలలు బిగ్‌బాస్ పొడిగించాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం హిందీ బిగ్ బాస్. అక్కడ ఇప్పటికే 14 సీజన్స్ ముగించుకొని.. 15వ సీజన్లోకి అడుగుపెట్టింది బిగ్‌బాస్. ఈ సారి ఏకంగా ఆరు నెలల పాటు ఈ సీజన్ కొనసాగనుంది. తెలుగులో కూడా ఇదే కంటిన్యూ చేస్తే బాగుంటుందని నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఏకంగా 180 రోజుల పాటు ఒక ఇంట్లో ఉండటం అనేది చిన్న విషయం కాదు. అది చెప్పినంత ఈజీ కూడా కాదు. కాస్త కష్టమైనా కూడా బిగ్ బాస్ 5 తెలుగు ఎక్కువ రోజులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అది 180 రోజులు ఉంటుందా లేదంటే 140 రోజులు ఉంటుందా.. అంతకంటే తక్కువ ఉంటుందా అనేది నిర్వాహకులు తేల్చనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
God father |చిరంజీవిని సంపత్ నంది కలవడానికి అసలు కారణం అదేనా..?
చిరంజీవి లూసిఫర్ రీమేక్‌లో విలన్‌గా సత్యదేవ్ ?
రోడ్డుపై స్నానం చేసి షాకిచ్చిన బాలీవుడ్ నటుడు
చిన్మయిని రేప్ చేసి చంపేస్తామంటూ బెదిరింపులు
‘మా’లో లొల్లి.. కుర్చీ దిగకూడదని నరేశ్ ప్రయత్నాలు: నటి హేమ
అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్‌ల్లోనూ హీరోయిన్ల హవా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

