మరో క్రేజీ ఆఫర్ అందుకున్న బిగ్ బాస్ బ్యూటీ..!

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమంతో పాపులర్ అయిన వారు చాలా మంది ఉన్నారు. కాని ఆ పాపులారిటీతో వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలో సెట్ అయిన వారు కొందరే. అలాంటి కోవలోకి దివి కూడా వస్తుంది. బిగ్ బాస్ షోకి ముందు ఈ అమ్మడు చాలా సినిమాలలో నటించింది. మహర్షి చిత్రంలోను మెరిసింది. అయితే ఈ అమ్మడిని ఎవరు పెద్దగా గుర్తించలేకపోయారు.
బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న దివి తన అందచందాలతో పాటు టాలెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. దివి అందాలకు చిరంజీవి కూడా ఫ్లాట్ అయి తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే క్యాబ్ స్టోరీస్‌తో హీరోయిన్గా అలరించిన ఈ భామకు తాజాగా మరో భారీ ఆఫర్ వచ్చిందట. సోగ్గాడే చిన్ని నాయన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఆధ్వర్యంలో రూపొందుతున్న ఓ వెబ్‌సిరీస్‌లో హీరోయిన్గా దివిని తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ వెబ్ సిరీస్‌కు కళ్యాణ్ కృష్ణ కథ అందించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరిస్తున్నారట. అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతం బంగార్రాజు పనులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మోనాల్‌ని ఓ పాత్రకు ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే కళ్యాణ్ కృష్ణ.. బిగ్ బాస్ బ్యూటీస్‌పై బాగానే కాన్సన్ట్రేషన్ చేసినట్టు అర్ధమవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bigg boss
- divi
- kalyankrishna
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

