Prakash Raj Surgery | ప్రకాశ్ రాజ్‌కు సర్జరీ..అసలేం జరిగిందంటే..?
ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) కు గాయమైనట్టు ఆయన ట్వీట్ ద్వారా తెలియజేశారు. సర్జరీ కోసం హైదరాబాద్ కు వస్తున్నట్టు ట్వీట్ ద్వారా తెలియజేశారు ప్రకాశ్ రాజ్.

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) కు సర్జరీ జరుగనుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సోషల్ మీడియాలో ప్రకాశ్ రాజ్ పెట్టిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ ప్రమాదంలో ప్రకాశ్ రాజ్ కు గాయాలైనట్టు ట్వీట్ ద్వారా తెలుస్తోంది. గాయాలకు శస్త్ర చికిత్స చేయించుకోవడం కోసం హైదరాబాద్ కు వస్తున్నట్టు ప్రకాశ్ రాజ్ తెలిపారు. డాక్టర్ గురువారెడ్డి (Dr Guruvareddy) తనను బాగా చూసుకుంటున్నారని, ఆయన పర్యవేక్షణలో సర్జరీ జరుగనుందని చెప్పారు ప్రకాశ్ రాజ్.
తనకు చిన్న గాయమైందని, ఎవరూ కంగారు పడాల్సిందేమి లేదని తన శ్రేయోభిలాషులు, ఫాలోవర్లు, అభిమానులకు తెలియజేశారు. ట్వీట్ ద్వారా సర్జరీ విషయం చెప్పిన ప్రకాశ్ రాజ్…ఇంతకీ ఆయన షూటింగ్ లో గాయపడ్డారా..? లేదా ఇంకెక్కడైనా ప్రమాదం జరిగిందా..? అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు ప్రకాశ్ రాజ్.
ఈ విలక్షణ నటుడి ఖాతాలో భారీ ప్రాజెక్టులే ఉన్నాయి. పాన్ ఇండియా సినిమా మేజర్ సినిమాలో కీ రోల్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న కేజీఎఫ్ చాఫ్టర్ 2లో, అల్లు అర్జున్ పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్ప, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సర్కారు వారి పాట లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మణిరత్నం తెరకెక్కిస్తోన్న భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్ లో ముఖ్య పాత్ర పోషిస్తుండగా..మరోవైపు రజినీకాంత్ హీరోగా వస్తున్న అన్నాత్తే లో నటిస్తున్నారు.
A small fall.. a tiny fracture.. flying to Hyderabad into the safe hands of my friend Dr Guruvareddy for a surgery. I will be fine nothing to worry .. keep me in your thoughts 😊😊😊🤗🤗🤗
— Prakash Raj (@prakashraaj) August 10, 2021
ఇవి కూడా చదవండి..
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
శృతి హాసMahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

