Kerala Tribal Girl Gopika Govind Became Air Hotess | చిన్నప్పుడెప్పుడో ఆకాశంలో ఎగిరే లోహ విహంగాలను చూసి విమానం ఎక్కాలని కలలుగన్నది.. గోపిక. కేరళలోని కపుంకుడి ఆమె సొంతూరు. వాళ్లది కరింబల అనే షెడ్యూల్డ్ తెగ. అమ్మానాన్న కూలీపని చేసుకుంటారు. ఆకాశంలో విమానాల్ని చూసిన ప్రతిసారీ ఎయిర్ హోస్టెస్ అవ్వాలని కలలుగనేది. కానీ అమ్మానాన్నలకు చెప్పే ధైర్యం చేయలేదు.
ఆర్థిక పరిస్థితులు అనుకూలించవనే భయం వెంటాడేది. ఆ సమయంలో ఎస్టీ బాలికల కోసం ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ స్కాలర్ షిప్‌తో వాయనాడ్‌లోని డ్రీమ్ స్కై ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీలో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసుకుంది. ఎయిర్ ఇండియాలో ఉద్యోగం సంపాదించింది. ఈమధ్యే శిక్షణ కోసం ముంబై వెళ్లింది. గోపిక ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగానికి ఎంపిక కావడం పట్ల తెగ పెద్దలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గోపిక అయితే.. అప్పుడే మేఘాల్లో తేలిపోతున్నది.
“బంజారాల జీవితాన్ని తన కుంచెతో అద్భుతంగా కళ్లకు కడుతున్న తెలంగాణ బిడ్డ”