‘అందరూ హేళన చేసినా.. వీ హబ్ అండగా నిలబడింది.. నా కలను నిజం చేసింది’
Ciel Desert Bar | హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదివింది. లండన్‌లో ఎంబీఏ మాస్టర్స్ చేసింది. అంతపెద్ద చదువులు చదివాక ఎవరైనా రోడ్ల వెంబడి ఫుడ్ ట్రక్ పెట్టుకుంటారా? కేకులు అమ్ముకుంటారా? కానీ, హైదరాబాద్ యువతి ఉదయశ్రీ పులి.. పట్టుబట్టి రుచుల వ్యాపారంలోకి వచ్చింది. డిసెర్ట్ ఫుడ్ ట్రక్‌ను ప్రారంభించింది. ఒక్కో అపజయం నుంచి పాఠాలు నేర్చుకుంటూ.. ఒడుదుడుకులే పునాదులుగా బేకరీ బిజినెస్‌లో స్థిరపడింది. ఆ విశేషాలను ‘జిందగీ’తో పంచుకుంది ఉదయ..

హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ తర్వాత మాస్టర్స్ కోసం లండన్ వెళ్లాను. అక్కడ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చాలా లాభదాయకంగా అనిపించింది. ఎలాగైనా ఇలాంటి వ్యాపారం మొదలుపెడదామని అనుకున్నా. ఆ విషయం ఇంట్లో చెప్పాను. తల్లిదండ్రులు మినహా ఎవరూ సపోర్ట్ చేయలేదు. కొందరు హేళన చేశారు కూడా. అయినా నేను వెనకడుగు వేయలేదు. ‘సీల్ డిసెర్ట్ బార్’ పేరుతో ఓ ఫుడ్ ట్రక్ ప్రారంభించాను. అలా కప్‌కేక్, బుట్టకేక్లతో మొదలుపెట్టి.. బ్రౌనీ, లామింగ్టన్, పేస్ట్రీ, డోనట్స్, బ్రెడ్, కుకీల లాంటి 23 రకాల రుచులను తయారు చేస్తున్నాను. ఫ్రూట్స్‌తో కూడా రకరకాల డిసెర్ట్స్ సిద్ధంగా ఉన్నాయి. భవిష్యత్‌లో మరిన్ని రుచులు తీసుకొస్తాను.

వ్యాపార చక్రాలు ఆగలేదు..
మా ఫుడ్ ట్రక్ ద్వారా ప్రవేశపెట్టిన ప్రతీ డిసెర్ట్ ప్రజల్లోకి వెళ్లింది. అప్పట్లోనే చాలామంది ఫోన్లో ఆర్డర్లు ఇచ్చేవారు. ట్రక్ ఎక్కడుందో తెలుసుకుని వచ్చి మరీ, ఇళ్లకు పార్సిళ్లు తీసుకెళ్లేవారు. మాదాపూర్‌లో ఎంతోమంది ఐటీ ఉద్యోగులు మా కస్టమర్లుగా మారారు. ఆదరణ పెరగడంతో సూపర్ మార్కెట్లకు కూడా కేకులు సరఫరా చేయడం ప్రారంభించాం. మాదాపూర్‌లోనే పెద్ద కిచెన్ ఏర్పాటుచేశాం. ఫుడ్, డిసెర్ట్ బార్ల తయారీ అంతా అక్కడినుంచే. ఇందుకు ప్రత్యేకంగా ఓ బృందం ఉంది. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ ఆర్డర్లు తీసుకుంటున్నాం. ఫంక్షన్లు, శుభకార్యాలు, బర్త్‌డేలకు ప్రత్యేకంగా కేకులు తయారు చేయించుకుంటారు. బేకరీ బిజినెస్‌లోకి అడుగుపెట్టి దాదాపు ఏడేండ్లు అయింది. ఏ ఒక్క రోజు కూడా మా వ్యాపార చక్రం ఆగిపోలేదు.

తోడుగా ‘వీ హబ్’
హైదరాబాద్‌లో ఫుడ్ బిజినెస్ అనుకున్నంత సులభం కాదు. నిండా మునిగాకే ఆ విషయం నాకు తెలిసింది. వ్యాపారం ప్రారంభంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నాను. ప్రయోగాలు చేయడానికేమో నా శక్తి సరిపోలేదు. ఆ సమయంలో ‘వీ హబ్’ అండగా నిలిచింది. అప్పటివరకు పెన్ను, పేపర్‌పైనే ఉన్న నా వ్యాపారం ఎక్సెల్ షీట్‌కి మారింది. మెంటర్స్ విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. మళ్లీ వ్యాపారం పుంజుకుంది. లాభాలు వచ్చాయి. వెనక్కితిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నా ప్రయాణం మరింత ముందుకు సాగుతున్నది. ఫుడ్ ట్రక్ వల్ల దుకాణం అవసరం లేకుండా పోయింది. అద్దె బాధ తప్పింది. కస్టమర్లు ఆదరించే చోటికే మేం వెళ్తున్నాం. మా వెబ్సైట్ www.cieldessertbar.com ద్వారా కూడా కేక్స్ ఆర్డర్ చేసుకోవచ్చు.

త్వరలోనే ఎలక్ట్రిక్ ట్రక్లు..
హైదరాబాద్ నలుమూలలా మాకు కస్టమర్లు ఉన్నారు. అందులో సెలెబ్రిటీలు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. వాళ్ల నమ్మకమే మా పెట్టుబడి. త్వరలోనే ఫుడ్ ట్రక్‌లను ఎలక్ట్రిక్ వాహనాల్లోకి మార్చుతున్నాం. వచ్చే ఏడాది నాటికి నగరంలోని ఐదు ముఖ్య ప్రాంతాల్లో ఈ ట్రక్కులు తిరుగుతాయి. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు నా వంతు ప్రయత్నమిది. వ్యాపారం ఓ సామాజిక బాధ్యత కూడా.
అడుగు బయటపెట్టండి
మీకు ఎలాంటి బిజినెస్ ఐడియా ఉన్నా సరే.. ముందు ఇంట్లోంచి అడుగు బయటపెట్టండి. ఆ రంగం గురించి లోతుగా అధ్యయనం చేయండి. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు వీ హబ్ ఉండగా ఉంటుంది. మెంటర్స్ మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. మీ ఆలోచన కార్యరూపం దాల్చి, ఓ బ్రాండింగ్ వచ్చేవరకూ తోడుగా ఉంటారు. ఇందుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. బిజినెస్‌లో ఏదైనా డౌట్ వస్తే.. నేను ముందుగా వెళ్లేది వీహబ్కే. ఆంత్రప్రెన్యూర్స్ కోసం ఆ సంస్థ తలుపులు తెరిచే ఉంటాయి.
– ఉదయశ్రీ పులి, వ్యాపారవేత్త
…✍ రవికుమార్ తోటపల్లి, 📷చిన్న యాదగిరిగౌడ్
Read More :
“Niharika NM | ఈమెతో రీల్స్ చేయడానికి స్టార్ హీరోలు కూడా పోటీపడుతుంటారు”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- bakery
- Hyderabad
- inspiration
- V Hub
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

