డ్యాన్స్ స్టెప్పులు వేయిస్తూ ఫిట్నెస్ పెంచుతున్న హైదరాబాదీ అమ్మాయి
Disha Methi Khandelwal | కొందరికి నాట్యం కళ. ఇంకొందరికి ఆటవిడుపు. దిశా మేతి ఖండేల్వాల్కు డ్యాన్స్ ఒక ఔషధం. నృత్యం ఒక వ్యాయామం. జుంబా డ్యాన్స్‌తో సరికొత్త ఫిట్నెస్ పాఠాలు చెబుతున్నది ఆమె. పని ఒత్తిడిలో ఆరోగ్యాన్ని అలక్ష్యం చేస్తున్న అతివలతో జుంబా స్టెప్పులు వేయిస్తున్నది. ఆనందంతోపాటు ఆరోగ్యాన్నీ బోనస్‌గా అందిస్తున్నది.
హైదరాబాద్‌కు చెందిన దిశా మేతి ఖండేల్వాల్ బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో అప్లయిడ్ ఫైనాన్స్‌లో పీజీ చేసింది. చదువుల్లో రాణిస్తూనే, చిన్నప్పటి నుంచీ ఇష్టపడిన డ్యాన్స్ గురించే ఎప్పుడూ ఆలోచించేది. సొంతంగా డ్యాన్స్ స్టూడియో పెట్టాలన్నది ఆమె ఆశయం. ఇదే మాట ఇంట్లోవాళ్లకు చెబితే సీఏ పూర్తి చేయాలని షరతు విధించారు. తల్లిదండ్రుల మాట మీద సీఏలో చేరినా, డ్యాన్స్‌కు దూరం కాలేకపోయింది. చివరికి మనసుకు నచ్చిన పనే చేయాలని నిశ్చయించుకొని, సీఏ కాదనుకొని డ్యాన్స్ బాటపట్టింది దిశా. మొదట్లో ఫ్రీలాన్సర్‌గా కెరీర్ ప్రారంభించింది. సంగీత్ వేడుకల్లో కుటుంబసభ్యులకు డ్యాన్స్‌లు నేర్పడం, కార్పొరేట్ ఉద్యోగులకు డ్యాన్స్‌లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. అలా.. ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టి జుంబా డ్యాన్స్‌ను కెరీర్‌గా మలుచుకుంది.
కరోనా నేర్పిన ఆన్లైన్ పాఠం!
జుంబా డ్యాన్స్‌లో నైపుణ్యం సాధించిన తర్వాత కొందరికి ప్రత్యేకంగా డ్యాన్స్ నేర్పడం ప్రారంభించింది. ఇదే సమయంలో కరోనా రావడంతో ఆన్లైన్ వేదికగా జుంబా డ్యాన్స్‌కు ఫిట్నెస్ను జతచేస్తూ.. కొత్త ప్రయోగాలు చేసింది. అవి ఫలించడంతో దిశాను సంప్రదించే ఔత్సాహికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. విదేశాల్లో ఉన్న భారతీయులూ ఆన్లైన్ శిష్యులయ్యారు. ఇప్పటివరకు ఆమె ద్వారా దాదాపు 800 మందికి పైగా డ్యాన్స్ ఫిట్‌నెస్‌లో శిక్షణ పొందారు. ఇటీవల బంజారాహిల్స్‌లో ‘ద డీఎంకే ( The DMK Studios )’ పేరిట ఓ డ్యాన్స్ స్టూడియోను ప్రారంభించింది. దాదాపు 2,500 ఫిట్నెస్ సెషన్లు నిర్వహించింది. రోజూ 80 మందికి శిక్షణను ఇస్తుంది. మహిళలకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నది.

పోషకాహారం గురించీ
ఒకవైపు జుంబా డ్యాన్స్‌తో ప్రయోగాలు చేస్తూనే, పోషకాహారంపై దృష్టిపెట్టింది. వర్కవుట్లు మాత్రమే కాకుండా, ఎప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలో వివరిస్తున్నది. ‘ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, ఇంటిపనితో మహిళలు సమయానికి సరిగా తినరు. దీనివల్ల వారిని ఎన్నో సమస్యలు వెంటాడుతాయి. అందుకే వారికి వ్యాయామంతోపాటు పోషకాహారం ప్రధానం అని చెబుతుంటాను. రొటీన్ వర్కవుట్లు కాకుండా, ఫిట్నెస్ చాలెంజ్‌లు నిర్వహిస్తుంటాను’ అంటుంది దిశ. కొత్తపాటలకు సరికొత్త స్టెప్పులు నేర్పుతూ ఉంటుంది. సరిగ్గా చేసినవారికి ప్రోత్సాహకాలూ ఇస్తుంది. జుంబా ఫిట్నెస్ డ్యాన్స్‌కు వస్తున్న ఆదరణ చూసి.. హైదరాబాద్‌లో మరికొన్ని ప్రాంతాల్లో ‘ద డీఎంకే’ డ్యాన్స్ స్టూడియోలు ప్రారంభించే ఆలోచనలో ఉంది దిశా మేతి ఖండేల్వాల్.
Read More :
“ఈ లైబ్రరీ మహిళల కోసమే.. ఇక్కడ దొరికే బుక్స్ అన్నీ ఆడవాళ్లు రాసినవే..”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Dance
- fitness
- inspiration
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

