Sister Library | ముంబైలోని ధారావి.. మురికివాడలకు చిరునామా. అక్కడే పురుడుపోసుకుంది ‘సిస్టర్ లైబ్రరీ’. మహిళల కోసమే ఏర్పాటైన ఈ గ్రంథాలయాన్ని ఆర్టిస్ట్ అక్వీ థామీ ప్రారంభించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి స్త్రీవాద గ్రంథాలయం. లోపలికి అడుగుపెట్టగానే ఆలోచన రేకెత్తించే పుస్తకాలు దర్శన మిస్తాయి. వాటిని రాసినవారు కూడా మహిళలే.
అవును.. రచయిత్రుల సాహిత్యానికే ఆ లైబ్రరీలో స్థానం. ఈ లైబ్రరీని కమ్యూనిటీ హాలుగా తీర్చిదిద్ది.. స్థానికులతో అక్షరాభ్యాసం కూడా చేయిస్తున్నారు అక్వీ థామీ. ఐదేండ్ల క్రితం 100 పుస్తకాలతో ప్రారంభమైనా.. ఇప్పుడు ఆ సంఖ్య వెయ్యికి పైమాటే. నేపాల్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, అమెరికా దేశాల సాహిత్యానికీ ఇందులో చోటిచ్చారు. ఇదే ఉత్సాహంతో ‘రేడియో సిస్టర్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు థామీ. ‘సిస్టర్ ప్రెస్’ ద్వారా ఇక్కడ ముద్రణలో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ‘సిస్టర్ టైమ్స్’ మాసపత్రికను స్థానిక మహిళలే ముద్రిస్తారు.
“ప్రకృతి వైద్యానికి సంబంధించి ఈ లైబ్రరీలో దొరకని బుక్ ఉండదు!!”