జొన్న పరాటా తయారీకి కావలసిన పదార్థాలు : జొన్న పిండి: రెండు కప్పులు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, క్యారెట్: ఒకటి, కొత్తిమీర తురుము: రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: కొద్దిగా.
ఒక గిన్నెలో జొన్నపిండి, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ తురుము, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి గోరువెచ్చని నీళ్లతో చపాతీపిండిలా కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని కాస్త మందంగా పరాటాల్లా ఒత్తుకోవాలి. జొన్న పరాటాపెనం వేడయ్యాక నూనెవేసి రెండువైపులా కాల్చుకుంటే వేడివేడి జొన్న పరాటా సిద్ధం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
pneumonia ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి?
Foods for body warm: చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
Zinc and Cold : జింక్‌తో జలుబు, దగ్గుకు చెక్ పెట్టొచ్చు..! వెస్ట్రన్ వర్శిటీ పరిశోధన
Winter and Mustard : శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
Mixed Fruits :ఈ పండ్లను కలిపి తింటున్నారా? అయితే, ఒక్కసారి ఇది చదవండి!