Holding Hands | ఇద్దరు మనుషుల మధ్య బంధం బలపడాలంటే ప్రేమ, నమ్మకం తప్పనిసరి. స్నేహితులతోనో, జీవిత భాగస్వామితోనో అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అనుకునేవారికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది. నడుస్తున్నప్పుడో, కబుర్లు చెప్పుకొంటున్నప్పుడో, పాటలు వింటున్నప్పుడో.. చేతిలో చెయ్యేస్తే అద్భుతాలు జరుగుతాయట. ఆ స్పర్శ మనసుకు ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుందట.
యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన సైకాలజీ ప్రొఫెసర్ జేమ్స్కూన్ చేపట్టిన అధ్యయనం ఈ విషయాన్ని నిరూపించింది. అందుకేనేమో పసిబిడ్డలు కూడా, కన్నతల్లి చేతివేలు పట్టుకోగానే ఠక్కున ఏడుపు ఆపేస్తారు. బడికెళ్లే చిట్టి చెల్లికి అన్న చేయి ఆలంబన అవుతుంది. పురిటినొప్పుల సమయంలో భర్త చేయిపట్టుకునే భార్యకు, నొప్పి భారం తగ్గినట్టు అనిపిస్తుందని నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. ఆత్మీయుల చేతి స్పర్శ మెదడులోని హైపోథాలమస్ పనితీరునూ మెరుగుపరుస్తుందని జేమ్స్ తన అధ్యయన పత్రంలో వెల్లడించారు.
Gold Consumption | బంగారం ఎక్కువగా కొంటున్నది వాళ్లేనట.. 90% నగదే చెల్లిస్తున్నారు
ఐఐటీ అబ్బాయి.. ఐఐటీ అమ్మాయి.. ఇద్దరూ కలిశారు.. అద్భుతం సాధించారు
సీతారాముల దాంపత్యం నేటి భార్యాభర్తలకు ఎందుకు ఆదర్శమో తెలుసా!