IND vs WI : తొలి వన్డే (First ODI) లో విండీస్ ఓపెనర్ల (Windies Openers) దూకుడుకు కళ్లెం పడింది. ఓపెనర్లు జాన్ క్యాంప్‌బెల్ (John Campbell), జస్టిన్ గ్రీవ్స్ (Justin Greevs) నెలకొల్పిన 135 పరుగుల భాగస్వామ్యానికి కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) తెరదించాడు. 20వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ వేసిన రెండో బంతిని అంచనా వేయడంలో క్యాంప్‌బెల్ విఫలమయ్యాడు. బంతి కిందకు వస్తుందన్న అంచనాతో కూర్చుని స్వీప్ షాట్ ఆడబోయాడు. అయితే బంతి కొద్దిగా పైకి రావడంతో అప్పర్ ఎడ్జ్‌ను తాకి పైకి ఎగిరింది. ప్రసిధ్ కృష్ణ (Prasidh Krishna) చక్కటి క్యాచ్ అందుకున్నాడు. దాంతో జాన్ క్యాంప్‌బెల్ (60 బంతుల్లో 62 పరుగులు) పెవిలియన్‌కు చేరాడు.
అప్పటికి జట్టు స్కోర్ ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు. క్యాంప్‌బెల్ ఔటవగానే ఆయన స్థానంలో కీసీ కార్టీ క్రీజులోకి వచ్చాడు. కాగా టాస్ ఓడిన విండీస్‌ను భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇన్నింగ్స్ మొదటి నుంచే ఓపెనర్లు జాన్ క్యాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్ దూకుడుగా ఆడారు. లైన్ అండ్ లెంత్‌లో వచ్చిన బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులను బౌండరీ లైన్ దాటించారు. దాంతో స్కోర్ క్రమంగా పెరుగుతూ పోయింది. గిల్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా ఫలితం లేకుండాపోయింది. ఎట్టకేలకు 135 పరుగుల తర్వాత ఆ పార్ట్‌నర్‌షిప్‌కు బ్రేక్ పడింది.