మోడల్ అంటే అందంగానే ఉండాలా?
Self Confidence | ఊబకాయం, బొల్లి మచ్చలు, డౌన్ సిండ్రోమ్.. సవా లక్ష సమస్యలు ఉండవచ్చు. అయితేనేం, క్యాట్‌వాక్‌లు మేమూ చేయగలమని అంటున్నారు కొత్తతరం మోడళ్లు. వీళ్ల ప్రభావంతోనే అందాల లోకానికి కమ్మిన పొరలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఆ ఉత్సాహానికి కార్పొరేట్ల ప్రోత్సాహమూ తోడవుతున్నది. నిన్నటివరకూ క్యాట్‌వాక్ అంటే సౌందర్య ప్రదర్శన. ఇప్పుడు ఆత్మవిశ్వాస వ్యక్తీకరణ.

సోఫియా జిరౌ
ఫ్యాషన్ ప్రపంచంలోనే ‘విక్టోరియా సీక్రెట్’ ఓ తిరుగులేని బ్రాండ్. అంతపెద్ద కంపెనీ ప్యూర్టోరికోకు చెందిన డౌన్ సిండ్రోమ్ బాధితురాలు సోఫియా జిరౌను మోడల్‌గా ఎంపిక చేసుకుంది. మోడలింగ్ ప్రపంచంలో ఇదొక పెద్ద సంచలనం. ఎలాంటి బిడియం లేకుండా ర్యాంప్‌పై హొయలు పోతూ.. తన కలల ప్రపంచాన్ని నిజం చేసుకున్నది సోఫియా.

ఎల్లీ గోల్డ్‌స్టెయిన్
బ్రిటిష్ మోడల్ ఎల్లీ గోల్డ్‌స్టెయిన్ కూడా డౌన్స్ సిండ్రోమ్ బాధితురాలే. గూచీ బ్యూటీ క్యాంపెయిన్‌లో వైకల్యం ఉన్న మొదటి మోడల్‌గా ప్రపంచ ఖ్యాతి పొందింది. 2017లో పర్సనల్ కేర్ బ్రాండ్ ‘డవ్’ కోసం బ్లైండ్ యూట్యూబ్ స్టార్ మోలీ బర్క్‌తో కలిసి ప్రచారం చేసింది. ఇప్పుడు గూచీ బ్యూటీ సంస్థలో మోడల్‌గా రాణిస్తున్నది.

వర్షిత తటవర్తి
విశాఖకు చెందిన వర్షిత తటవర్తి ప్లస్ సైజ్ మోడలింగ్‌లో హవా కొనసాగిస్తున్నది. డిజైనింగ్ కంపెనీ సబ్యసాచి మోడల్‌గా గుర్తింపు తెచ్చు కున్నది. వివాదాస్పద మంగళసూత్ర యాడ్‌తో మరింత ప్రాచుర్యం పొందింది. చిన్ననాటి నుంచి సినిమాలు, మోడలింగ్‌పై ఆశపెట్టుకున్న వర్షిత.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నది.

ప్రణవ్ బక్షి
19 ఏండ్ల భారతీయ మోడల్ ప్రణవ్ బక్షి.. ఆటిజం ఉన్న మొట్టమొదటి పురుష మోడల్‌గా చరిత్ర సృష్టించాడు. ఇన్నాళ్లూ తన రుగ్మతే తన శత్రువని అనుకున్న ప్రణవ్.. ఆ రుగ్మతతోనే మోడలింగ్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకొన్నాడు. యూఎస్ పోలో, బెన్టన్, ఎఫ్‌బీబీ సంస్థల బ్రాండ్లకు బక్షి రాయబారి. టెడ్ఎక్స్ వేదికపై రెండుసార్లు ఉపన్యసించి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాడు.

విన్నీ హార్లో
జమైకన్- కెనడియన్ ఫ్యాషన్ మోడల్ విన్నీ హార్లోకు చిన్ననాటి నుంచే బొల్లి వ్యాధి. అయినా, నిండైన ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తూ.. తానేమిటో నిరూపించుకున్నది. అనేక బ్రాండ్స్‌కు మోడల్‌గా వ్యవహరించింది. ల్యూకోడెర్మా (బొల్లి) బాధితులను అందరితో సమానంగా చూడాలని పోరాడుతున్నది. బొల్లి మచ్చలతో కూడిన ఆమె బొమ్మలు మార్కెట్లోకి వచ్చాయి.

ప్రీషియస్ లీ
నల్లజాతీయురాలైన ప్రీషియస్ లీ ప్రపంచంలోనే మొట్టమొదటి ‘బ్లాక్ ప్లస్ సైజ్ మోడల్’. లావుగా ఉన్నా ర్యాంప్‌లను షేక్ చేస్తున్నది లీ. ఇప్పటికే అనేక బ్రాండ్లకు మోడల్‌గా ఉన్నది. వర్ధమాన బ్లాక్ మోడల్స్‌కు తనే ఆదర్శం.
Read More :
India Pride Project | దేవుళ్లకు రక్షకుడు ఈయన.. ఇంతకీ ఏం చేస్తాడు?”
కాళ్లు, కండ్లు లేకపోయినా నలుగుర్ని నడిపిస్తున్నరు.. వైకల్యానికే సవాలు విసురుతున్నరు”
“అమెరికా అధ్యక్షుడికే పట్టు శాలువాను పంపిన సిరిసిల్ల యువకుడు చేసిన అద్భుతాల గురించి తెలుసా”
“నాసాలో జాబ్ వదిలేసి.. రైతుల కోసం కష్టపడుతున్నడు”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- inspiration
- Models
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

