అమెరికా అధ్యక్షుడికే పట్టు శాలువాను పంపిన సిరిసిల్ల యువకుడు చేసిన అద్భుతాల గురించి తెలుసా
Nalla Vijay | నాన్న చేనేత కళాకారుడు. ముప్పై ఏండ్ల కిందటే అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి, చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటాడు. కానీ, బంగారు చీర నేయాలనే కల నెరవేరకుండానే మరణించాడు. తండ్రి మగ్గాన్నే వారసత్వ సంపదగా భావించాడు తనయుడు. అగ్గిపెట్టెలో పట్టేంత చీరకు ప్రాణం పోశాడు. బంగారు చీరను నేసే ప్రయత్నమూ చేస్తున్నాడు.

సిరిసిల్లలోని సాయినగర్‌కు చెందిన నల్ల విజయ్ ( Nalla Vijay ) కుమార్ చేయి తిరిగిన చేనేతకారుడు. వైవిధ్యమైన ఆవిష్క రణలతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాడు. పదేండ్ల నుంచీ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తునే ఉన్నాడు. తాజాగా అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి.. కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి.. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బహూకరించాడు. విజయ్ తండ్రి నల్ల పరంధాములు చేనేత శిల్పిగా గుర్తింపు పొందారు. తొలిసారిగా 1991లో ఎనిమిది మీటర్ల పొడవైన చీరను పట్టుదారాలతో నేశారు. దానిని అగ్గిపెట్టెలో ఇమిడ్చి చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటారు. అప్పట్లో అదొక సంచలనం. ఇదే కాదు కుట్టులేని అంగీని, జాకెట్టును మగ్గంపై నేసి చేనేతలో అద్భుతాలు సాధ్యమని నిరూపించారు పరంధాములు. 112 మీటర్ల జాతీయ జెండాను కూడా తయారు చేశారు. అట్లాంటా ఒలింపిక్స్ వేడుకల్లో భారతీయ క్రీడాకారులు దానిని ప్రదర్శించారు కూడా. అక్కడితో ఆగకుండా.. రూ. 4 కోట్ల విలువైన బంగారంతో చీరను నేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అనారోగ్యం బారినపడి 2006లో కన్నుమూశారు.

ఒబామాకు కానుక
తండ్రి మగ్గాన్నే తన ఆస్తిగా భావించాడు విజయ్. ఆ మగ్గంపై ఎన్నో ప్రయోగాలు చేశాడు. అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను నేశాడు. ఎనిమిది మీటర్ల పొడవు ఉండే ఆ పట్టుచీర బరువు కేవలం వంద గ్రాములు. ఆ తర్వాత దబ్బనంలో దూరేంత నాజూకుగా ఐదు మీటర్ల చీరకు ప్రాణం పోశాడు. అంతేనా,మూడు రకాల డిజైన్లతో మూడు కొంగులతో వినూత్నమైన చీరను ఆవిష్కరించాడు. చేనేత మగ్గంపై బంగారు పోగులతో బ్రేస్‌లెట్‌ను సృష్టించాడు. అరటినారతో శాలువా నేసి ఉగాది పర్వదినాన సీఎం కేసీఆర్‌కు బహూకరించాడు. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, పట్టు శాలువాలను నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు పంపాడు విజయ్.

కట్టుకునేలా.. సూక్ష్మచీర
అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను ఇప్పటి వరకు ఓ నమూనాగా మాత్రమే చెప్పుకొనేవారు. కట్టుకునే అవకాశం ఉండేది కాదు. కానీ విజయ్ నేసిన చీరను నిక్షేపంగా కట్టుకోవచ్చు. ఆయన ఇప్పటి వరకు వందకుపైగా సూక్ష్మమైన చీరలను నేశాడు. మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది కూడా. కంచి నేతన్నలకు దీటుగా వెండి కొంగు కంచిపట్టు చీరను నేశాడు. తండ్రి పరంధాములు జీవిత చరిత్రను మరాఠీ పాఠ్యాంశాల్లో చేర్చడం.. విజయ్‌కి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. విజయ్ కళకు గుర్తింపుగా తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, హైరేంజ్ బుక్ ఆఫ్
రికార్డ్స్‌లో చోటు దక్కింది. తిరుమల వెంకన్నకు ఓ అరుదైన కానుక సమర్పించాడు విజయ్. దశాబ్దం క్రితం శ్రీవారిని దర్శించుకున్నప్పుడు అగ్గిపెట్టెలో పట్టే 60 గ్రాముల బరువున్న నాలుగున్నర మీటర్ల చీరను మొక్కుగా చెల్లించాడు. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారికి కూడా అగ్గిపెట్టెలో పట్టే చీరలను కానుకగా అందించాడు. అంతేకాదు, తామరనారతో పట్టుచీర నేశాడు. ఒకటా రెండా, ఇలాంటి ప్రయోగాలు ఎన్నో! ‘ఏదో ఓ రూపంలో చేనేతకు గుర్తింపు తీసుకురావడానికే ఈ ప్రయత్నమంతా. ప్రతి రంగంలో ఆవిష్కరణలు అవసరమే’ అంటాడు విజయ్.
Read More :
ఒక్క ఏడాదిలోనే 200 కోట్లు సంపాదించిన 8 ఏండ్ల చిన్నారి”
నాసాలో జాబ్ వదిలేసి.. రైతుల కోసం కష్టపడుతున్నడు”
“Bhavana Lasya | ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, వీడియోల ద్వారా యాక్టింగ్ ఛాన్స్ వచ్చింది”
అమెరికాలో జాబ్ వదిలేసొచ్చి.. సొంతూళ్లో లైబ్రరీ స్టార్ట్ చేసిండు”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

