ఒక్క ఏడాదిలోనే 200 కోట్లు సంపాదించిన 8 ఏండ్ల చిన్నారి
Like Nastya | పిల్లలు సెల్ఫోన్లకు అలవాటు పడిపోతే, చదువు పాడైపోతుందని కన్నవారి భయం. కానీ సరిగ్గా మాటలు కూడా రాని వయసులోనే యూట్యూబ్ స్టార్‌గా మారింది రష్యాకు చెందిన అనస్తాసియా రాడ్జిన్స్కాయా. బొమ్మలతో ఆడిపాడుతూ కోట్లు సంపాదిస్తున్న ఆ చిన్నారి గురించి..
2014లో పుట్టిన అనస్తాసియాకు సెరెబ్రల్ పాల్సీ అనే తీవ్ర సమస్య ఉందనీ, అందువల్ల ఆ చిన్నారి శాశ్వతంగా మాట్లాడలేకపోవచ్చనీ వైద్యులు చెప్పారు. అయినా, తల్లిదండ్రులు నిరాశపడలేదు. 2015లో ‘అనస్తాసియా’ పేరుతో ఒక యూట్యూబ్ చానల్ ప్రారంభించి.. ఆడమనీ, పాడమనీ ప్రోత్సహించారు. ఏది ఇష్టమైతే అది చేయమని వెన్ను తట్టారు. తమ కంపెనీలో తయారుచేసే వస్తువులను ఆ చానల్ ద్వారా విక్రయించడం ప్రారంభించారు.
అనస్తాసియాకు పెరుగుతున్న క్రేజ్ చూసి 2016లో ‘లైక్ నాస్ట్యా( Like Nastya )’ అనే చానల్‌నూ ప్రారంభించారు. అది మొదలు ఎనిమిదేండ్ల వయసులోనే పదకొండు యూట్యూబ్ చానళ్లు నిర్వహిస్తూ 26 కోట్ల సబ్‌స్ర్కైబర్ల మనసు దోచుకుంది. ప్రపంచంలోనే చిన్నారి యూట్యూబర్‌గా నిలిచిందీ చిచ్చర పిడుగు. 2021లో యూట్యూబ్ వల్ల రూ. 200 కోట్ల ఆదాయం పొందింది. ‘ఫోర్బ్స్’ పత్రిక ప్రకారం యూట్యూబ్ ద్వారా అత్యధిక రాబడి కలిగినవారిలో ఈ చిన్నారిది ఆరోస్థానం. ప్రపంచంలోనే టాప్ టెన్ యూట్యూబ్ చానళ్లలో ‘లైక్ నాస్ట్యా(Like Nastya)’ చోటు దక్కించుకోవడం గొప్ప విషయం.
Follow Us : Google News, Facebook, Twitter, Instagram, Youtube
Read More :
“Bhavana Lasya | ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, వీడియోల ద్వారా యాక్టింగ్ ఛాన్స్ వచ్చింది”
Gitanjali Rao | 15 ఏళ్ల అమ్మాయే కదా అని తక్కువ అంచనా వేయకండి”
“Sai Chinmayi | ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డ”
అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- child
- inspiration
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

