HomeZindagiHealth Experts Saying To Health Benefits Of Onion Peel
పొట్టుతో పుట్టెడు మేలు
ఉల్లి చేసే మేలు.. తల్లి కూడా చేయదని అంటారు. అయితే, ఉల్లి పొట్టుతోనూ ఎన్నో ఉపయోగాలు
ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చెత్త బుట్టలో పడేసే ఆ పొట్టుతో.. పుట్టెడు లాభాలు పొందవచ్చు.
ఉల్లి చేసే మేలు.. తల్లి కూడా చేయదని అంటారు. అయితే, ఉల్లి పొట్టుతోనూ ఎన్నో ఉపయోగాలు
ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చెత్త బుట్టలో పడేసే ఆ పొట్టుతో.. పుట్టెడు లాభాలు పొందవచ్చు.
ఒక గ్లాసు నీటిలో కొంత ఉల్లిపాయ పొట్టు వేసి, పదిహేను నిమిషాలపాటు బాగా మరిగించాలి. ఆ నీటిని వడగట్టి తాగితే.. కండరాల నొప్పులు తగ్గుముఖం పడుతాయి.
జుట్టు సంరక్షణకు ఉల్లిపాయలతో ఎంత ప్రయోజనం ఉంటుందో.. ఉల్లి పొట్టు కూడా అంతే సాయపడుతుంది. దీనిలో సల్ఫర్ ఎక్కువ. ఇది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే కొలాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది.
ఒక గ్లాసు నీటిలో నాలుగోవంతు ఉల్లి పొట్టును తీసుకొని.. గంటసేపు బాగా మరిగించాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలాగే వదిలేసి, మరుసటి రోజు ఉదయాన్నే వడబోసి.. జుట్టుకు బాగా పట్టించాలి. 30 నిమిషాలపాటు ఆరనిచ్చి.. తలస్నానం చేస్తే జుట్టు తెల్లబడటం తగ్గుతుంది. చుండ్రు కూడా తొలగిపోతుంది.
యాంటి ఫంగల్ గుణాలు కలిగిన ఉల్లిపాయ పొట్టు.. చర్మ సమస్యలకు చెక్ పెడుతాయి.
ఉల్లి పొట్టును నీటిలో మరగబెట్టి దురద, దద్దుర్లు ఉన్నచోట పూస్తే.. మంచి గుణం కనిపిస్తుంది.
ఉల్లి పొట్టుతో టీ చేసుకొని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ‘ఉల్లి టీ’.. నిద్రలేమిని దూరం చేయడంతోపాటు కంటి ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తుంది.
రెండు కప్పుల నీటిలో ఉల్లి పొట్టు వేసి.. నీటి రంగు మారేవరకూ మరిగించాలి. ఆ తర్వాత వడపోసి, ఒక టీస్పూన్ తేనె కలుపుకొంటే.. ‘ఉల్లి టీ’ సిద్ధం!