నిధుల గోల్మాల్పై యాక్షన్ షురూ
బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. రెండు రోజుల్లో కింది స్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. 2021 నుంచి 2024 వరకు కొండమడుగులో పనిచేసిన కార్యదర్శులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీవోలకు నోటీసులు ఇవ్వనున్నారు. పర్యవేక్షణా లోపం వల్ల డీఎల్పీవో, డీపీవోకు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
- కొండమడుగు గ్రామ పంచాయతీలో రూ. కోటిన్నర వరకు దుర్వినియోగమైనట్లు గుర్తింపు
- రెండు రోజుల్లో బాధ్యులపై చర్యలు నాటి కార్యదర్శులు, ఎంపీవోలు, డీఎల్పీవో, డీపీవోలకు నోటీసులు
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. రెండు రోజుల్లో కింది స్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. 2021 నుంచి 2024 వరకు కొండమడుగులో పనిచేసిన కార్యదర్శులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీవోలకు నోటీసులు ఇవ్వనున్నారు. పర్యవేక్షణా లోపం వల్ల డీఎల్పీవో, డీపీవోకు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
నోటీసులకు సరైన సమాధానం ఇవ్వని నేపథ్యంలో సదరు ఉద్యోగులు, అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన కొండమడుగులో నిధుల దుర్వినియోగాన్ని గతేడాది జూలైలో నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చింది. బిల్లులు, ఎంబీ రికార్డులు, ఓచర్లు లేకుండా అడ్డగోలుగా నిధులు దుర్వినియోగం చేశారు. బిల్లు ఒకరి పేరుపై, చెక్కు మరొకరి పేరుపై డ్రా చేశారు. ఈ ఘటనపై కలెక్టర్ హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతేడాది జూలై 7న గ్రామ కార్యదర్శి అలివేలును సస్పెండ్ చేశారు. ఎంపీవోను ఎం దుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టాలని అప్పటి డిప్యూటీ జెడ్పీ సీఈవో, ప్రస్తుత డీపీవో విష్ణువర్ధన్ రెడ్డిని ఆదేశించారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.కోటిన్నర వరకు గోల్ మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఒకే ఏజెన్సీకి అవసరం లేకున్నా రూ.72లక్షల బిల్లులు ఇచ్చారని తేల్చారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం నిధులు దుర్వినియోగం చేస్తే ఆ డబ్బును రికవరీ చేయాలి. దీంతో కాజేసిన ప్రభుత్వ సొమ్మును రికవరీ చేసే పనిలో అధికారులు ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

