చక్కటి ఆరోగ్యానికి చిక్కటి నిద్ర ఎంతో అవసరం. లేకుంటే.. అనారోగ్యాల పాలవ్వడం ఖాయం! ఈ విషయంలో నిద్ర ఒక్కటే కాదు.. నిద్రపోయే భంగిమ కూడా ఎంతో కీలకం. అందులోనూ ఎడమవైపు తిరిగి పడుకుంటే.. ఎంతో ప్రయోజనకరం.
రకరకాల మనుషులు.. రకరకాలుగా నిద్రిస్తుంటారు. కొందరు వెల్లకిలా పడుకుంటే.. మరికొందరు బోర్లా పడుకుంటారు. కొందరు కుడివైపు వాలితే.. ఇంకొందరు ఎడమవైపునకు ఒరుగుతుంటారు. వీటన్నిట్లోకి.. ఎడమవైపు తిరిగి పడుకోవడమే ఆరోగ్యానికి ఎంతో మేలని అంటున్నారు నిపుణులు. ఇలా పడుకోవడం వల్ల భవిష్యత్తులోనూ ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని చెబుతున్నారు.