Stylist Anahita | ‘ఏజెంట్ అఖిల్’.. రాటుదేలిన దేహానికి సరిపోయేలా ఓ బ్లాక్ డ్రెస్‌తో హల్చల్ చేశాడు. వెండితెరకు దూరమైనప్పటి నుంచీ సోషల్ మీడియాలో మాయచేస్తున్నది ‘కుమారి 21 ఎఫ్’. ‘లైగర్’ విజయ్ దేవరకొండ ఫొటోషూట్‌లో యమ సెక్సీగా కనిపించాడు. ముద్దుగుమ్మ మెహ్రీన్ శారీ ఫొటోలు ‘బాప్రే’ అనిపిస్తున్నాయి. కూల్‌కూల్ రకుల్‌ప్రీత్, కండలవీరుడు రానా సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నారు. ఈ మెరుపుల వెనుక అనాహిత అనే మహిళ ఉన్నారు. ఇంతకీ, ఎవరీ అనాహిత? టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్.. అగ్రతారలస్టైలిస్ట్గా ఎలా అవతరించారు? ఆమె మాటల్లోనే..
తెలుగు ప్రజలకు పెద్ద హాయ్! చిన్నప్పటి నుంచీ నాకు హైదరాబాద్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడే సెయింట్ మేరీస్‌లో బీఎస్సీ మ్యాథ్స్ చేశాను. ప్రపంచంలో నాకు బాగా నచ్చిన ప్రదేశాల్లో హైదరాబాద్ ఒకటి. మా ఆయన కూడా హైదరాబాద్‌ను ప్రేమిస్తారు. నేను ఇద్దరు బిడ్డల తల్లిని. ఎంతోమంది సెలబ్రిటీలకు స్టైలిస్ట్‌ని.
అసలు స్టైలిస్ట్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. అప్పట్లో, నా సోదరి ఆనందితతో కలిసి హైదరాబాద్‌లో ‘ఆనందిత యాక్ససరీస్’ నిర్వహించేదాన్ని. మొదట్లో మాకు మార్కెటింగ్ గురించి అవగాహన లేదు. దీంతో మా బ్రాండ్‌ను ప్రజల్లోకి, సెలబ్రిటీల్లోకి తీసుకెళ్లేందుకు చాలా కష్టపడ్డాం. అప్పటికే నేను జర్నలిజంలో ఉన్నాను. ఓ ప్రయత్నంగా స్టార్ హోటళ్లలో ఎగ్జిబిషన్లు నిర్వహించేవాళ్లం. ఓ నటి తన ఆకృతికి తగినట్టు కొన్ని యాక్ససరీస్ ఇవ్వమని కోరింది. అలా ఆమెకు స్టైలిస్ట్‌గా మారిపోయాను.
సానియా మీర్జా సోదరి ఆనమ్‌తో నాకు పరిచయం ఉండేది. ఓసారి ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమానికి సానియాకు ఆహ్వానం అందింది. తోడుగా నన్నూ ముంబై తీసుకెళ్లింది. ఆ రోజు నుంచీ నా ప్రపంచమే మారిపోయింది. మొదటిసారి యశ్‌రాజ్ స్టూడియోలో అడుగుపెట్టాను. సానియా గదికి వెళ్తున్నప్పుడు గ్రీన్‌రూమ్ బయట నా అభిమాన హీరో షారుక్ ఖాన్ పేరు కనిపించింది. (నవ్వుతూ..) అప్పుడు చూడాలి నాలో వైబ్రేషన్స్! ఆ తర్వాత నిజంగానే, షారుక్‌ను కలిసే అవకాశం వచ్చింది. మాట్లాడుతుంటే చెమటలు పట్టేశాయి. ఆ ఆనందంలో వణుకు మొదలైంది. ఆయన నన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడంతో దెబ్బకు మూర్ఛపోయాను. ఎవరో నా ముఖంపై నీళ్లు చల్లి కుర్చీలో కూర్చోబెట్టారు.
..లేదు. (నవ్వుతూ) ఆ వివక్ష ఎక్కడా లేదు. ఏ ఇండస్ట్రీ అయినా పని పనే. నైపుణ్యాన్ని బట్టే గౌరవం. ఎదుటి మనిషిని చూడగానే… ఎలాంటి దుస్తులు వారికి నప్పుతాయన్నది నా మనసుకు తెలిసిపోతుంది. దాన్నే ఫాలో అవుతా. ఒక్కోసారి శరీరాకృతికి తగ్గట్టు నాలుగైదు మోడళ్లు ప్రయత్నిస్తాను. ఆ డ్రెస్‌లో నా క్లైంట్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటే.. క్లిక్‌లు చూసి మురిసిపోతాను. ఆ కిక్ ఎక్కడలేని ఉత్సాహాన్నిస్తుంది. అందుకే, సోషల్ మీడియాకు థ్యాంక్స్ చెబుతున్నాను.
రెండు బాధ్యతలూ ముఖ్యమే. రెండిటినీ చక్కగా సమన్వయం చేసుకుంటున్నా. ఫ్యామిలీ సపోర్టే నా బలం. ఒక స్టైలిస్ట్‌గా నేను తరచూ షూట్స్‌కు వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని ఈవెంట్స్‌కు స్టార్లతో కలిసి ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రతిసారీ ఎవరో ఒకరు తోడుగా వస్తుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు.. పిల్లలు పడుకున్న సమయంలో ఎక్కువగా హోంవర్క్ చేసుకుంటాను. పిల్లలతో గడపడం ఎంత ఇష్టమో, క్లైంట్స్తో మాట్లాడటమూ నాకు అంతే ఇష్టం. ఈ ఫీల్డ్‌లో నాకు బాగా నచ్చింది టైమ్ మేనేజ్మెంట్. కొందరు నాలుగైదు గంటల సమయం ఇస్తారు. మరికొందరు గంట మాత్రమే కేటాయిస్తారు. ఆ వ్యవధిలోనే సాధ్యమైనంతస్టైలిష్గా చూపించాలి. ఆ ప్రయత్నంలో ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకుంటాను. చివరికి వచ్చేసరికి నా క్లైంట్.. పురుషుడైతే గ్రీకు వీరుడిలా, మహిళ అయితే రాచకన్యలా కనిపించాలి.
తెలుగు పరిశ్రమలో నేను పూర్తిస్థాయి స్టైలిస్ట్‌గా మారాక ఎన్నో అవకాశాలు తలుపుతట్టాయి. రానా దగ్గుబాటి, రకుల్ ప్రీత్ సింగ్, అదితీరావ్ హైదరీ, రాశీ ఖన్నా, ప్రణీత, అదా శర్మ, నిధి అగర్వాల్, మెహ్రీన్ పీర్జాదా, చార్మీ కౌర్, రెజీనా, అనుపమా పరమేశ్వరన్, అఖిల్ అక్కినేని, విజయ్ దేవరకొండ, సుమంత్, నవదీప్, సిద్ధూ జొన్నలగడ్డ, ప్రిన్స్, డైరెక్టర్ తరుణ్‌భాస్కర్.. నా క్లైంట్స్ జాబితా పెద్దదే. సైనా నెహ్వాల్, సానియా మీర్జా వంటి క్రీడాతారలు, ఒకరిద్దరు యాంకర్స్ కూడా నా సేవలు అందుకుంటున్నారు.
… డప్పు రవి
“సమంత, అఖిల్ ఫిట్నెస్ వెనుక ఉన్నది ఇతనే.. బాలీవుడ్ స్టార్స్ కూడా ఈయన శిష్యులే”
గ్లామర్ డాల్ ఇమేజ్ కోసం నేనెప్పుడూ వెంపర్లాడలేదు.. ఓపెన్ అయిన బాలీవుడ్ బ్యూటీ
కాజల్, రకుల్, అల్లు అర్జున్ సహా టాప్ సెలబ్రెటీలకు ఈయనే మేకప్ ఆర్టిస్ట్.. ఎవరో తెలుసా